విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా తన ఇంట్లో హీరోయిన్ అనన్యా పాండేతో సహా పూజలో పాల్గొన్నాడు.దేశం మొత్తం తిరిగొస్తున్న విజయ్ కోసం తన మదర్ ప్రత్యేక పూజ చేయించారు.
అంతేకాదు విజయ్, అనన్యాల సినిమా లైగర్ హిట్ అవ్వాలని కూడా పూజ చేయించారట. విజయ్ ఇంట్లో అనన్యా హడావిడి చేసింది.
అయితే విజయ్ దేవరకొండ ఇంట్లో అనన్యా వెళ్లడం అక్కడ విజయ్ మదర్ తో ఆమె మాట్లాడటం ఇదంతా ఓ హీరోయిన్ కి మింగుడు పడటం లేదని టాక్.
ఆమె ఎవరో కూడా అందరికి తెలిసిందే.
విజయ్ తో క్లోజ్ గా ఉండే రష్మిక మందన్న ప్రస్తుతం అనన్యా పాండే మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.విజయ్ తో తనకి పెయిర్ పెట్టి మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తుంది.
వీళ్లిద్దరు కూడా ఆ గాసిప్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు.అయితే విజయ్ ఇంట్లో అనన్యా సందడి చూసి రష్మిక అప్సెట్ అయినట్టు కూడా చెప్పుకుంటున్నారు.
అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం ఉండదు.సినిమా హీరో అన్న తర్వాత ఎంతోమంది హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉంటాడు అయినంత మాత్రాన వాళ్ల మధ్య ఏదో ఉన్నట్టు కాదు.
అందులోనూ విజయ్, రష్మికల మధ్య ఏమి లేనప్పుడు అతను ఎవరిని ఇంటికి తీసుకెళ్తే ఏంటని రివర్స్ లో కౌంటర్ వేసే ఛాన్స్ ఉంది.