కొత్త కొత్త అప్‌డేట్‌లతో Google ఆండ్రాయిడ్ 13 వెర్షన్ వచ్చేస్తోంది!

ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజ సంస్థ Google తన యూజర్లకు ఓ శుభవార్త తెలియజేసింది.Google తన కొత్త ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను స్మార్ట్ ఫోన్లకు విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

 కొత్త కొత్త అప్‌డేట్‌లతో Google ఆ-TeluguStop.com

ఈ ఏడాది చివర్లో Samsung, Xiaomi, Nokia వంటి స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త OS వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వెర్షన్‌గా ఆండ్రాయిడ్ 13ను తీసుకువస్తున్నారు.

కొత్త అప్‌డేట్‌లో చాలా కొత్త ఆప్షన్స్ రాబోతున్నాయి.ఇంతకుముందు వెర్షన్‌లో ఉన్న సమస్యలను ఈ కొత్త అప్‌డేట్‌లో పరిష్కరించారు.

గూగుల్ అసిస్టెంట్, ఆడియో, ఛార్జింగ్ మరిన్నింటికి సంబంధించిన అనేక బగ్ పరిష్కారాలను ఇందులో అందించారు.కొత్త OSలో అప్‌డేట్ చేయబడిన మీడియా ప్లేయర్ కూడా ఉంది.ఇది పాటలు, పాడ్‌కాస్ట్ రకం ఆధారంగా దాని “లుక్ అండ్ ఫీల్”ని మారుస్తుంది.వినియోగదారులకు మంచి సంగీతానుభవాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

సెకండరీ ప్రొఫైల్‌లలో NFC చెల్లింపులను కూడా సపోర్ట్ చేస్తుంది.ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను సోమవారం నుండి తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల చేయడం ప్రారంభించినట్లు గూగుల్ ప్రకటించింది.

Google Pixel 4 XL, Pixel 4a, Pixel 4a 5G, Pixel 5, Pixel 5a 5G, Pixel 6, Pixel 6 Pro, Pixel 6a వంటి ఫోన్‌లు అప్‌డేట్‌ను పొందుతున్న జాబితాలో ఉన్నాయి.

Telugu Andorid, Android Launch, Android Ups, Google Android, Ups-Latest News - T

ఇది పర్సనల్ యాప్‌లకు నిర్దిష్ట భాషలను సెట్ చేయడానికి అనుమతిస్తుంది.ఒక్కసారి Android 13 ఇన్‌స్టాల్ చేశాక, పాత Android 12కు తిరిగి వెళ్లలేరని కంపెనీ తెలిపింది.కొత్త వెర్షన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌, వేలిముద్ర స్కానర్, టచ్ స్క్రీన్ పామ్ డిటెక్షన్ రెస్పాన్స్, కొత్త వాల్‌పేపర్‌, థీమ్‌లు, థర్డ్-పార్టీ కెమెరా యాప్‌ల కోసం HDR వీడియో సపోర్ట్‌ చేయడంతో పాటు పలు రకాల కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఈ ఏడాది చివర్లో, ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ Samsung Galaxy, Asus, HMD (Nokia phones), iQOO, Vivo, Xiaomi, Motorola, OnePlus, Oppo, Realme, Tecno వంటి బ్రాండ్‌లతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube