సీనియర్ నటుడు రాజా రవీంద్ర రవితేజ కాళ్లు కడిగారట.. ఏం జరిగిందంటే?

స్వయం కృషితో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరనే సంగతి తెలిసిందే.సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ రవితేజ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

 Raja Ravindra Reveals Some Interesting Events Actor Raviteja , Actor Raviteja, R-TeluguStop.com

క్రాక్ సక్సెస్ తో జోరుమీదున్న రవితేజ త్వరలో ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇండస్ట్రీలో రవితేజ స్నేహితులలో రాజా రవీంద్ర కూడా ఒకరు.

పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన రాజా రవీంద్ర కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ లో కూడా నటించారు.

తాజాగా క్రేజీ అంకుల్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజా రవీంద్ర ఆ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ రవితేజ ఆర్టిస్ట్ కాకముందే తనకు క్లోజ్ అని అన్నారు.తాను రవితేజ కాళ్లు కడిగి పెళ్లి చేశానని రాజా రవీంద్ర వెల్లడించారు.

తనను రవితేజ మేనేజర్ ను చేశాడని ఆ తర్వాత తాను పలువురు సినీ ప్రముఖుల డేట్స్ చూశానని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

రవితేజతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని రాజా రవీంద్ర తెలిపారు.

రవితేజ పెళ్లి సమయంలో ఆయన అత్తామామలు అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటంతో తాను కాళ్లు కడగాల్సి వచ్చిందని రాజా రవీంద్ర పేర్కొన్నారు.రవితేజ తనను మామ అని పిలుస్తాడని ఆ రీజన్ వల్లే తాను రవితేజ కాళ్లు కడిగానని రాజా రవీంద్ర అన్నారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా రాజా రవీంద్ర మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Telugu Raviteja, Raja Ravindra, Reveals-Movie

రవితేజకు తనకు ఆర్థికపరమైన విభేదాలు ఏమీ లేవని రాజా రవీంద్ర అన్నారు.మనీ వ్యవహారాలను రవితేజ మాత్రమే చూసుకునే వారని బయట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube