అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో చైనా గ్రామాలను నిర్మిస్తున్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంగా మారాయి.భారత్ ఇప్పుడు ఒక శక్తవంతమైన దేశం అని.
స్వంతంగా ఆయుధాలు మందుగుండు తయారు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు.ప్రపంచంలో ఆయుధాలు తయారు చేస్తున్న 25 దేశాల సరసన భారత్ ఉందని చెప్పుకొచ్చారు.
భారత్ ఇప్పుడు ఆయుదాలను దిగుమతి చేసుకునే దేశం కాదని.ఎలాంటి చర్యలకైనా ధీటుగా సమాధానం ఇచ్చే దేశమని అన్నారు.
అయితే చైనా కొత్త పన్నాగం పసిగట్టిన తర్వాత రాజ్ నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.? చైనా దుందుడుకు చర్యలకు భారత్ త్వరలో చెక్ పెట్టనుందా.?
చైనా ముక్కుకు కళ్లేం వేసేందుకు ఆర్మీ ఏవైనా కసరత్తులు చేస్తోందా.? అనే చర్చ దేశంలో మొదలైంది.దానికి తోడు పాక్ ను సైతం హెచ్చరించారు.కశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో అంతర్భాగమని అన్నారు.భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తనదిగా గుర్తించిన తర్వాత ఏకంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు.దేశ సార్వభౌమత్వాన్ని గానీ, దేశ పటాన్ని గానీ ఎవరు తప్పుగా చిత్రీకరించినా.
కించపరిచినా సహించేది లేదని హెచ్చరించారు.

దాంతో తొక ముడిచిన చైన తన మ్యాప్ ను మార్చేసుకుంది.అయితే ఇప్పుడు అచ్చం అలాగే బఫర్ జోన్ లో చైనా గ్రామాలను నిర్మిస్తున్న తరుణంలో రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వెనుక అంతర్యం ఏంటనేది ప్రశ్నగా మారింది.నిజంగా భారత్ చైనాకు చెక్ పెట్టేందుకు ఏవైనా వ్యూహాలు రచిస్తోందా అని దాయాది దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అమరవీరులను స్మరించుకునే కర్గిల్ దివాస్ రోజున రాజ్ నాథ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.ఇప్పుడు భారత్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేసింది.
అనేది ఆసక్తిగా మారింది.