ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దోషిగా తేలారు.ప్రధాని ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై రాహుల్ విమర్శలు చేశారు.ఈ క్రమంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది.ఈ నేపథ్యంలోనే రెండేళ్ల జైలు శిక్షను కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.