చిత్రం : రాధ
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర
దర్శకత్వం : చంద్రమోహన్
నిర్మాత : భోగవళ్ళి బాపినీడు
సంగీతం : రాధన్
విడుదల తేది : మే 12,, 2017
నటీనటులు – శర్వానంద్, లావణ్య త్రిపాఠి, అక్ష, రవి కిషన్ తదితరులు
కథలోకి వెళితే :
రాధకృష్ణ (శర్వానంద్) కి చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే పరమభక్తి.చిన్నతనంలోనే కృష్ణలీలలు, భగవద్గీత తెలుసుకుంటాడు.
మంచి మనిషి ప్రమాదంలో ఉంటే దేవుడే భూమి మీదకి కాపాడేందుకు వస్తాడు అనే మాట బలంగా నాటుకుపోతుంది రాధకృష్ణ మొదడులో.అలాంటి సమయంలో కృష్ణని ఓ చిన్ని ప్రమాదం నుంచి కాపాడుతాడు ఓ పోలీసు .దాంతో ప్రజల్ని కాపాడేందుకు నేను పోలీసు అవుతానని నిశ్చయించుకుంటాడు.అనుకున్నట్లుగానే ఎస్ఐ జాబ్ పట్టిన రాధకృష్ణని జీరో క్రైమ్ రేట్ ఉన్న వరంగల్ జిల్లా బర్సానపల్లికి పంపిస్తుంది పోలీసు డిపార్టుమెంటు.
అక్కడ రాధను (లావణ్య) చూసి కృష్ణ ప్రేమలో పడతాడు.ఓవైపు బర్సానపల్లిలో ప్రేమకథ నడిపిస్తూ, మరోవైపు తనను క్రైమ్ రేట్ ఉన్న స్థలానికి బదిలి చేసేలా ప్రయత్నాలు మొదలుపెడతాడు కృష్ణ
మొత్తానికి కృష్ణని హైదరాబాద్ లోని ధూల్ పేట్ ఏరియాకి బదిలీ చేస్తారు.
అక్కడ మరో కథ నడుస్తూ ఉంటుంది.పైకి మంచి నాయకుడిలా నటిస్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కుతంత్రాలు పన్నుతుంటాడు సుజాత (రవికిషన్).తన ప్లాన్ లో భాగంగానే కొంతమంది పోలీసులని కూడా చంపిస్తాడు.పోలీసు డిపార్టుమెంటు ఇమేజ్ కి చిన్న మచ్చ కూడా అంటకుండా డ్యూటి చేసే రాధకృష్ణ, ఏకంగా తన డిపార్టుమెంటు మనుషులనే చంపిచేస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు.సుజాత నిజస్వరూపం ఎలా బయటపెట్టాడు అనేది మిగితా కథ.
నటీనటుల నటన :
శర్వానంద్ తను ఈమధ్య పోషిస్తున్న పాత్రలకు భిన్నంగా కమర్షియల్ హంగులున్న రాధ పాత్రను ఎంచుకున్నాడు.కామెడి టైమింగ్ అంటూ చేసింది చాలాచోట్ల ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది.ఇంటర్వల్ కి ముందు వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శర్వ ట్రాక్ ఎక్కినట్లే అనిపించనా, మళ్ళీ గాడితప్పి ఓవర్ యాక్షన్ కనబడుతుంది.
లావణ్య త్రిపాఠి ఆటలో అరడిపండు లాగా సరిగ్గా పాటకు ముందు ఓసారి కనబడిపోతుంది.గ్లామరస్ గా కనబడటం తప్ప లావణ్య ఇందులో చేసింది ఏమి లేదు.మరో పాట కోసం పాటకి కాస్త ముందు అక్షని తీసుకొచ్చారు.రవి కిషన్ విలనిజం ఒక్క సెకను కూడా మెప్పించదు.
ఎక్కడో ఒకటి అర సీన్లలో మాత్రమే లిప్ లింక్ ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పేలవంగా ఉందో ఆ పాత్ర.కామెడియన్స్ లో సప్తగిరి కొంచెం రిలీఫ్ ని అందిస్తాడు.షకలక శంకర్ ఫర్వాలేదు.
టెక్నికల్ టీమ్ :
రాధన్ సంగీతం ఫర్వాలేదు.ఒక పాట బాగుంటుంది ఒకటి ఉండదు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బెటర్.కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫి బాగుంది.మొత్తం టీమ్ లో 100% ఇచ్చింది కెమరా డిపార్టుమెంటు మాత్రమే.
ఎడిటింగ్ చాలా దారుణం.రెండున్నర గంటలు కూడా లేని సినిమాలో ఎన్నో అనవసరపు సీన్లు.
ఏదో మూడున్నర గంటల సినిమా చూసిన ఫీల్.నిర్మాణ విలువలు బాగున్నాయి.
పెద్ద బ్యానర్ కదా .బాగా ఖర్చుపెట్టారు.
విశ్లేషణ :
డైరెక్టర్ చంద్రమోహన్ కి ఇదే తొలి సినిమా అయితే పూర్తిగా నిందించాల్సిందే అతడినే.శర్వానంద్ లాంటి మార్కెట్ ఉన్న హీరో అవకాశమిస్తే ఇంత పేలవమైన కథ, కథనం, సీన్లతో రావడం కరెక్టు కాదు.
మంచి సినిమాలతో ఫామ్ లో ఉన్న శర్వ తన ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేసినట్లుగా కనబడుతోంది.ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.రాష్ట్రానికి కాబోయే సిఏం మరీ కామెడి అయిపోయాడు.దానికి ప్రేక్షకులు నవ్వుకుంటారు అని భ్రమపడ్డారు.
ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చిన సినిమాలా అనిపించింది రాధ.పాటల కోసం కనబడే హీరోయిన్, బఫూన్ లా అనిపించే విలన్.అదే పోలీసు, అదే కానిస్టేబుల్స్ కామెడి.పటాస్ లాంటి ప్రయత్నం అనుకోవాలో, గబ్బర్ సింగ్ కి మరో వెర్షన్ అనుకోవాలో, వాటిలోని కామెడిని అనుకరించి, కథబలాన్ని పట్టించుకోలేదు.ఏ వర్గాన్ని మెప్పిస్తుందో ఈ సినిమా మరి.
ప్లస్ పాయింట్స్ :
* సినిమాటోగ్రాఫి
* ఒకటి రెండు కామెడి సీన్లు
మైనస్ పాయింట్స్ :
మిగితావన్ని
చివరగా :
రాధ కాదు ఇది బాధ