చిత్రం : రెమోబ్యానర్ : 24 AM స్టూడియోస్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (తెలుగు విడుదల)దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్ నిర్మాతలు : ఆర్.డి.
రాజా, దిల్ రాజు (పంపిణి)సంగీతం : అనిరుద్విడుదల తేది : నవంబర్ 25, 2016నటీనటులు : శివకార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య తదితరులు
తమిలానాట వరుస విజయాలతో దూసుకుపోతున్న యువహీరో శివకార్తికేయన్.ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, చాలా తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ గా ఎదిగాడు.
ఓపెనింగ్స్ లో ధనుష్, సూర్య లాంటి హీరోలను కూడా ఓడించే ఈ కుర్రహీరో తెలుగు మార్కెట్ కోసం చేసిన తోలి ప్రయత్నం “రెమో”.తమినాడులో భారి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని అదే పేరుతొ అగ్రనిర్మాత దిల్ రాజు తెలుగులోకి అనువదించారు.
మరి ఈ సినిమా ఆద్యంతం ఎలా సాగిందో చూద్దాం.
కథలోకి వెళ్తే :
సినిమా హీరో కావాలని కలలుగనే సగటు కుర్రాడు ఎస్.కె ( శివకార్తికేయన్) తొలిచూపులోనే డాక్టర్ కావ్య (కీర్తి సురేష్) ని చూసి ప్రేమలో పడతాడు.కాని తనకి అప్పటికే వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిందని తెలిసి నిరుత్సాహపడతాడు.
మరోవైపు ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తన కొత్త సినిమా కోసం నిర్వహిస్తున్న ఆడిషన్స్ కి వెళతాడు ఎస్.కె.అక్కడ ఓ లేడి గెటప్ నర్స్ పాత్ర అవసరమని తెలిసి అచ్చం అమ్మాయిలా గెట్ అప్ మారుస్తాడు.అదే గెట్ అప్ లో కావ్యకి పరిచయమై, తన హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ తన ప్రేమను గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు.
మరి తన ప్రయత్నాలు ఫలించాయా లేదా అనేది విషయం తెర మీద చూడాల్సిందే.
నటీనటున నటన గురించి :
ఈరోజు శివకార్తికేయన్ తమిళనాడులో పెద్ద స్టార్ అయ్యాడు అంటే దానికి కారణం అతడి కామెడి టైమింగ్.అతని వాయిస్ మాడ్యులేషన్ తో జనాల్ని బాగా నవ్విస్తాడు.పెర్ఫార్మెన్స్ పరంగా శివ మెప్పించినా, తెలుగు వెర్షన్ విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ తన టైమింగ్ ఫీల్ మొత్తం పోగొట్టింది.
కీర్తి సురేష్ తెలుగు వెర్షన్ వరకు అతిపెద్ద అస్సేట్.అందంగా కనిపించింది.
తన క్యారెక్టర్ కి చేసిన డబ్బింగ్ వర్క్ కూడా ఫర్వాలేదు.ఇక తెలుగు వారికి తెలిసిన నటి శరణ్య తల్లి పాత్ర బాగుంది.
కె.ఎస్ రవికుమార్ అతిథి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.
సాంకేతిక వర్గం పనితీరు :
పీ.సి శ్రీరాం భారతదేశంలోనే అతిపెద్ద కెమెరా టెక్నిషియన్స్ లో ఒకరు.
నితిన్ ఇష్క్ తరువాత ఆయన చేసిన ఈ ప్రేమకథ తెర మీద అందంగా కనిపించింది.పాటలు కూడా అద్భుతంగా చిత్రీకరించారు.
అనిరుద్ బాణీలు అదిరిపోగా, తెలుగు వెర్షన్ పాటలు కూడా బాగా పాడించారు.ఇక నేపథ్య సంగీతం ఎప్పటిలానే బాగా ఇచ్చాడు.
డబ్బింగ్ వర్క్స్ చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి.
విశ్లేషణ :
హీరో లేడి గెటప్ లో నవ్వించడం తెలుగు సినిమాలో కొత్తేమి కాదు.కాబట్టి అలాంటి కామెడి తెలుగు ప్రేక్షకులకి తెలియనిది కాదు.తమిళనాట శివకార్తికేయన్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండటం, సినిమా కేవలం తన కామెడి టైమింగ్ మీదే ఆధారపడి ఉండటంతో, గొప్ప కథ కాకపోయినా, ప్రేక్షకులని నవ్వించి బాగా ఆడేసింది.
తెలుగు వెర్షన్ బోర్ కొట్టకపోయినా, ఆక్కట్టుకునే విధంగా లేదు.డబ్బింగ్ సరిగా లేక నవ్వు పుట్టించాల్సిన సన్నివేశాలు కూడా తేలిపోయాయి.రెండోవభాగం కామెడి తగ్గడం, సినిమా సాగదీసినట్టుగా అనిపించడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ డబ్బింగ్ సినిమాకి హారతులు పట్టడం కష్టం అనిపిస్తోంది.రఘువరన్ బీటెక్, బిచ్చగాడు కథాబలం ఉన్న సినిమాలు.
రెమోలో ఆ బలం లేదు.శివకార్తికేయన్ కి తెలుగులో ఇదే తోలి డబ్బింగ్ సినిమా.
కాబట్టి ఎంత లాగినా అది దిల్ రాజు బ్రాండ్ మూలానే.
చివరగా :
టైమింగ్ మిస్ అయ్యింది.
తెలుగుస్టాప్ రేటింగ్ : 2.5/5