ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్.. చివరికి గర్భం దాల్చడంతో..!

Qatar Papa Shalini Complaint Against Boy Friend Rohit Khan,Qatar Pap,Shalini,Rohit Khan,Tiktok,Junior Artist,Hyderabad,SR Nagar Police Station

ఇటివలే కాలంలో సమాజం రోజురోజుకు దారుణంగా తయారవుతుంది.ఎవరిని నమ్మాలో.

 Qatar Papa Shalini Complaint Against Boy Friend Rohit Khan,qatar Pap,shalini,roh-TeluguStop.com

ఎవరిని నమ్మకూడదొ తెలియని పరిస్థితి.ఇక ప్రేమ, పెళ్లి, బంధాలకు విలువలు తగ్గుతూ పోతున్నాయి.

మంచి, మానవత్వానికి సమాజంలో చోటు లేదు.కొన్ని సంవత్సరాలు వెంటపడి, తనను ప్రేమించకుంటే బతకలేనని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భం దాల్చాక దారుణంగా మోసం చేసిన సంఘటన హైదరాబాదులోని బోరబండలో చోటుచేసుకుంది.

దారుణంగా మోసపోయానని గ్రహించిన జూనియర్ ఆర్టిస్ట్ శాలిని (అలియాస్ కతర్ పాప) హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన శాలిని అనే జూనియర్ ఆర్టిస్ట్ గుంటూరు జిల్లా కాకాని వద్ద ఉన్న చర్చికి తరచూ వెళ్ళేది.

ఆ ప్రాంతం లో వుండే రోహిత్ ఖాన్ అనే ఒక వ్యక్తి 2021 సంవత్సరం నుండి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.మొదట శాలిని, రోహిత్ ఖాన్ ప్రేమను అంగీకరించలేదు.

Telugu Hyderabad, Artist, Love, Qatar Pap, Rohit Khan, Shalini, Sr Nagar, Tiktok

శాలిని హైదరాబాదు లోని బోరబండలో అద్దెనివాసంలో ఉంటూ షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ లలో నటిస్తుంది.ఇక రోహిత్ ఖాన్ టిక్ టాక్ లో శాలిని మొబైల్ నెంబర్ చూసి, కాంటాక్ట్ చేసి తాను నిజంగానే ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్ వచ్చాడు.నిజంగానే పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లికి కాస్త సమయం కావాలి అని మాయమాటలు చెప్పడంతో శాలిని, రోహిత్ ఖాన్ ప్రేమను అంగీకరించింది.

ఇక వీరిద్దరూ కలిసి బోరబండ లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉండేవారు.

కొన్ని రోజులు తనతో రోహిత్ ఖాన్ ప్రేమగా, సన్నిహితంగా ఉన్నాడు.తర్వాత శాలిని పై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో 2022 ఆగస్టులో ఆమె గర్భవతి అయిన విషయం రోహిత్ ఖాన్ కు తెలిపింది.

Telugu Hyderabad, Artist, Love, Qatar Pap, Rohit Khan, Shalini, Sr Nagar, Tiktok

అప్పటినుండి సరిగా మాట్లాడకుండా పెళ్లికి నిరాకరించడంతోపాటు బెదిరించాడు.రోహిత్ ఖాన్ తన కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, రోహిత్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని జూనియర్ ఆర్టిస్ట్ శాలిని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని రోహిత్ ఖాన్ కోసం వెతుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube