పురంధరేశ్వరి కి పదవీ గండం ! కారణం ఇదే 

ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకోవడంతో పాటు,  ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి</em( Daggubati Purandeswari ) ని తప్పించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏపీలో టీడీపీ,  జనసేన పార్టీలు( TDP Jana Sena parties ) పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో,  జనసేన తమతో కలిసి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి పెద్దలు ఒంటరిగానైనా ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

 Purandhareswari's Tenure This Is The Reason , Bjp, Telangana Bjp, Congress,-TeluguStop.com

అసలు ఈ ఉద్దేశంతోనే ఆరు నెలల కిందట ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురందరేశ్వరిని నియమించారు.ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను బిజెపిలో చేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆమె నియామకం చేపట్టారు .టిడిపి క్రమక్రమంగా బలహీనమవుతుందని,  ఆ పార్టీలోని కమ్మ సామాజిక వర్గం కి చెందిన వారిని బిజెపిలో చేర్చాలనే సూచనలు చేశారు.

అయితే పురందేశ్వరి బిజెపి బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా , టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి పెద్ద ఎత్తున వెళ్లాయి.దీనికి  తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన సమయంలో బీజేపీ అగ్ర నేతల వైఖరి ఏమిటో ఇంకా తేలకుండానే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించడం,  ఢిల్లీలో నారా లోకేష్ ( Nara Lokesh )తో కలిసి బిజెపి పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ బిజెపి  సీరియస్ గానే తీసుకుంది .

ఎన్నికల వరకు పురంధరేశ్వరి ( Daggubati Purandeswari )నే కొనసాగిస్తే బిజెపి మరింత బలహీనపడుతుందని,  అది టిడిపికి మేలు చేస్తుందనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి పెద్దలు పురందేశ్వరి స్థానంలో మరో కీలక నేతకు ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారట.ఎలాగూ  తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనతో బిజెపి అధిష్టానం ఉండడంతో,   ఆ నియామకంతో పాటే ఏపీ బీజేపి కి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube