దొంగకి తీర్పు చెప్పిన జడ్జికి కరోనా వైరస్...

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి సామాజిక దూరం పాటించాలని అంతేకాక నిత్యం సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడినటువంటి యువకుడికి తీర్పు చెప్పిన జడ్జి క్వారెనటెన్ కి వెళ్లిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 Punjab, Self Quarantine News, Corona News, Punjab News, Thief Verdict-TeluguStop.com

వివరాల్లోకి వెళితే తాజాగా స్థానిక రాష్ట్రంలోని ఓ యువకుడు ద్విచక్ర వాహనం మరియు చరవాణులను దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.దీంతో నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

అయితే నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన సమయంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు మహిళ జడ్జి గుర్తించింది.దీంతో వెంటనే నిందితుడికి వైద్య పరీక్షలు జరిపించాలని ఆదేశించగా నిందితుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

దీంతో నిందితుడిని పట్టుకున్న టువంటి పోలీసులు మరియు అతడికి తీర్పు చెప్పినటువంటి జడ్జి కూడా సెల్ఫ్ క్వారెంటెన్ కి  వెళ్ళింది.అలాగే పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ ను పూర్తిగా శానిటైజర్ తో శుభ్రపరిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube