ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.డీజీపీ ఆఫీస్ దగ్గరకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
శని, ఆదివారాలు డీజీపీ కార్యాలయానికి సెలవు ఉందన్న పోలీసులు రోడ్డు మీదనే ఫిర్యాదు అందజేశారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనలో తమ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడంపై మండిపడ్డారు.
తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పాదయాత్రలో సీజ్ చేసిన వాహనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.