కేసీఆర్ ను భయపెట్టేలా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ ?

2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్.టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే విధంగా వ్యూహాలను రచిస్తూ,  ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Prashant Kishore Survey Report To Scare Kcr , Kcr, Ktr, Trs, Telangana, Prasanth Kishore, Pk, Pk Report, Trs Mlas ,prashant Kishore Survey Report-TeluguStop.com

నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు , టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు,  ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళుతున్నాయి ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు.దానికి అనుగుణంగా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.

తాజాగా టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీమ్ నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులపై కెసిఆర్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

 Prashant Kishore Survey Report To Scare KCR , Kcr, Ktr, Trs, Telangana, Prasanth Kishore, Pk, Pk Report, Trs MLAs ,Prashant Kishore Survey Report-కేసీఆర్ ను భయపెట్టేలా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ నివేదికల్లో తేలిన అంశాలు కేసీఆర్ ను భయపెట్టేలా ఉన్నాయట.

ముఖ్యంగా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదురకుంటూ ఉండడం తో ఆ స్థానంలో వేరే ఒకరికి టికెట్ ఇవ్వాలని పీకే టీం సూచించిందట.ఇప్పటికే చాలామంది టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయంతో ఉన్నారట.

అందుకే ముందుగానే ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని , ఈ మేరకు ఆయా పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని,  టికెట్ హామీ పొంది ఎన్నికల సమయంలో పార్టీ మారాలని చాలామంది ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ టీం రిపోర్ట్ అందడంతో కెసిఆర్ మరింత ఆందోళన చెందుతున్నారట.
 

Telugu Pk, Telangana, Trs Mlas-Politics

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.అందుకే పెద్ద ఎత్తున నాయకులు బిజెపి,  కాంగ్రెస్ పార్టీలలో చేరేందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండటం,  రానున్న రోజుల్లో మరింత గా వలసలు పెరిగే అవకాశం ఉన్నట్లు గా  ఐ ప్యాక్ టీమ్ రిపోర్ట్స్ ఇస్తుండటంతో తో కెసిఆర్ లో మరింతగా టెన్షన్ పెరిగిపోతోందట.

 

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube