కరోనా కారణంగా గత నాలుగు అయిదు నెలలుగా నిలిచి పోయిన పెద్ద సినిమాల షూటింగ్స్ మెల్లగా ప్రారంభం అవుతున్నాయి.ఈ సమయంలో కేజీఎఫ్ 2 చిత్రీకరణ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయిన కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యాడు.ఆ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్ లో ఫొటోలు షేర్ చేసి మరీ తెలియజేశారు.
సినిమా షూటింగ్ ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రతి ఒక్కరికి ఈ విషయంలో కృతజ్ఞతలు అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
కేజీఎఫ్ మొదటి పార్ట్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ రెండవ పార్ట్ అంతకు పది రెట్ల భారీతనంతో యాక్షన్ సీన్స్ తో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు.దాంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అధీరా పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ కు క్యాన్సర్ అంటూ నిర్థారణ అయ్యింది.
దాంతో ఆయన పాత్ర విషయంలో కాస్త అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాని దర్శకుడు మాత్రం ఆ విషయం గురించి పట్టించుకోకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు.