ప్రభాస్ రేంజ్ ను ప్రూవ్ చేసే మూవీ అదే.. బాహుబలి2 రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

 Prabhas Salaar Needs To Get Just Positive Talk Details, Salaar, Prabhas, Positiv-TeluguStop.com

అయితే ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో లాంటి సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రభాస్ నటించిన సినిమాలలో ఆది పురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా టీజర్ పై భారీగా ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా విడుదల అయినా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకాలు లేవు అంటున్నారు అభిమానులు.ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో పాన్ ఇండియా సినిమా సలార్ కూడా ఒకటి.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు.

కాగా ప్రభాస్ నటించినా ఆది పురుష్ సినిమా పై నెగిటివ్ గా కామెంట్స్ వినిపించడంతో అంచనాలు అన్ని సలార్ సినిమాపై పెట్టుకున్నారు.

Telugu Salaar, Bahubali, Prasanth Neel, Fighter, Hrithk Roshan, Prabhas, Prabhas

అంతేకాకుండా సలార్ సినిమా కేజిఎఫ్ సినిమాను మించి కలెక్షన్స్ సాధిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సలార్ సినిమాకు సంబంధించి వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అదేమిటంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ నటిస్తున్న భారీ సినిమా ఫైటర్. ఈ సినిమా కూడా సలార్ సినిమాతో పాటు రిలీజ్ కాబోతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు ఫైటర్ సినిమా 2024 కి షిఫ్ట్ అవ్వడంతో వచ్చే ఏడాది అక్టోబర్ లో సలార్ సినిమా సోలో గానే రిలీజ్ కానుంది.ఒకవేళ సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తే ఖచ్చితంగా పాను ఇండియా మార్కెట్లో మళ్లీ ప్రభాస్ వసూళ్ల సునామి సృష్టించడం గ్యారెంటీ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా కొందరు బాహుబలి 2 సినిమా రికార్డ్స్ సలార్ సినిమా బద్దలు కొడుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube