ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు.అలాగే ప్రజలు తీసుకునే ఆహారంలోనే ఆరోగ్యానికి మంచి జరిగే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు.
వాటిలో క్యారెట్ లు ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే కనుక ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది.క్యారెట్ ను చాలా ఎక్కువ మంది పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు.
మరికొందరు హల్వా లాగా చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు.
ముఖ్యంగా క్యారెట్ గురించి చెప్పాలంటే ప్రతి రోజు ఒక పచ్చి క్యారెట్ తింటే చాలా రకాల అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
క్యారెట్‌లో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, కెరోటీనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది.అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.ప్రతిరోజు పచ్చి క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పురోగతికి వ్యతిరేకంగా పని చేస్తుంది.ఎక్కువగా ఆహారాన్ని తీనేవారు భోజనానికి ముందుగా క్యారెట్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.క్యారెట్ ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది.అంతేకాకుండా క్యారెట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది.ఇన్ని అనారోగ్యాలను దూరం చేసే క్యారెట్, మరికొన్ని అనారోగ్యాలతో బాధపడేవారు క్యారెట్ను తినకపోవడమే మంచిది.అలాంటి అనారోగ్యాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గట్ ప్రాబ్లమ్స్, పేగు సిండ్రోమ్, అల్సరేటివ్ కొలిటిస్ సమస్యలతో బాధపడేవారు పచ్చి క్యారెట్లను ఎక్కువగా తినకూడదు.ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు.అలాంటివారు ఉడికించిన క్యారెట్లు తినడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.అలాగే ఎలర్జీలతో బాధపడేవారు క్యారెట్ల కు దూరంగా ఉండడమే మంచిది.
క్యారెట్ తినడం వల్ల ఎలర్జీ పెరిగే అవకాశం ఉంది.ఏ ఆహారమైన తగినంత మోతాదులో తినడమే మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.