మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ.ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు ఎందుకని ప్రశ్నించారు.

 Minister Ktr Sensational Comments-TeluguStop.com

రేపిస్టులకు దండలేసి ఊరేగించిన బీజేపీకి చెందిన నాయకులు చేసే ప్రమాణాలకు విలువ ఎక్కడ ఉంటుందన్నారు.అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడ్ని తాకడం పాపమని, అందుకనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాల్సి ఉంటే చేయాలని వేదపండితులను కోరుతున్నట్టు కేటీఆర్ కోరారు.

రేపిస్టులకు దండలేసి ఊరేగించిన ఘన చరిత్ర బీజేపీదని, అలాంటి వారు చేసే ప్రమాణాలకు విలువ ఏమి ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్న ఆయన ఈ విషయంలో ఇప్పుడు ఏం మాట్లాడినా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నానని అంటారని, అందుకే ఈ విషయంలో మాట్లాడడం లేదని అన్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తాయన్నారు.

అందుకనే ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు చెప్పానన్నారు,అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube