బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఈయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవ్వరు చేయనన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.మేకర్స్ ఈయన క్రేజ్ ను వాడుకుని మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.మరి తాజాగా ఈ సినిమా ఉందని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
మారుతి డైరెక్షన్ ప్రభాస్ తో ఎలా ఉంటుందా? అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.
ఈ స్టోరీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ లో కాకపోయినా మారుతి ప్రేక్షకులను మెప్పించే కథాంశాన్ని తెరకెక్కించ బోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.రాజా డీలక్స్ అని సినిమాకు టైటిల్ పెట్టడానికి కారణం సినిమా కథే అని తెలుస్తుంది.
ఇది రాజా డీలక్స్ అనే ఒక థియేటర్ చుట్టూ తిరిగే తాత – మనవడి కథ అని.దీనికి హారర్ యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించ నున్నట్టు వార్తలు వస్తున్నాయి.పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన థియేటర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది.మరి ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ థియేటర్ సెట్ వేసారట.
దాదాపు ఈ థియేటర్ లోనే సినిమా మొత్తం షూట్ ఉండనుందని.కేవలం రెండు షెడ్యూల్స్ లోనే పూర్తి చేయనున్నారని టాక్.
సినిమా కేవలం 50 కోట్ల లోపే బడ్జెట్ పెట్టనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ నటించనుండి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న ఈ సినిమాను పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇది చిన్న సినిమా కావడంతో సలార్, ప్రాజెక్ట్ కే కంటే ముందే ఈ సినిమా పూర్తి చేయనున్నారట ప్రభాస్.