స్టార్ హీరో ప్రభాస్ ( Star hero Prabhas )తో సినిమా అంటే ప్రతి దర్శకుడు భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటాడు.ప్రభాస్ తో సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఆ దర్శకుడికి కెరీర్ పరంగా తిరుగుండదు.
సీతారామం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ప్రభాస్ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు.ప్రభాస్ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఆయన తెలిపారు.
వార్ బ్యాక్ డ్రాప్ లో రజాకార్( Razakar ) నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది.ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
విశాల్ చంద్రశేఖర్ ( Vishal Chandrasekhar )ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మూడు ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది.ఇప్పటివరకు హను రాఘవపూడి తెరకెక్కించిన సినిమాలన్నీ లవ్ స్టోరీలతో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం.
అయితే హను రాఘవపూడి రూట్ మార్చారని సమాచారం అందుతోంది.ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ ఈ ఏడాదే మొదలుకానుండగా వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలో ప్రభాస్ అంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఈ సినిమాను మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.
మైత్రీ నిర్మాతలు( mytri Producers ) వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సినిమాలు వరుసగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.