జస్టిన్ ట్రూడో ( Justin Trudeau ) సారథ్యంలోని కెనడా ప్రభుత్వం భారత్‌పై తరచుగా ఆరోపణలు చేస్తోంది.గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
దీనిని భారత్ తీవ్రంగా పరిగణించడమే కాకుండా నాటి నుంచి భారత్ – కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది కెనడా.
తన ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్‌లు( India , Pakistan ) జోక్యం చేసుకున్నాయని ఆరోపించింది.
ఈ మేరకు కెనడా గూఢచార సంస్థ 2019, 2021 సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత్, పాకిస్తాన్‌ల రహస్య కార్యకలాపాలను ఆరోపిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది.దీనిపై భారత్ భగ్గుమంది.
ఈ దర్యాప్తును నిరాధారమైనదిగా పేర్కొన్న న్యూఢిల్లీ తమ అంతర్గత వ్యవహారాల్లో కెనడాయే జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.
2021లో ఖలిస్తాన్ ఉద్యమం, పాకిస్తాన్ అనుకూల వైఖరికి మద్ధతుగా నిలిచే భారత సంతతి ఓటర్లు ఎక్కువగా వున్న నిర్దిష్ట ఎన్నికల జిల్లాలను భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్( Canadian Security Intelligence Service ) (సీఎస్ఐఎస్) ఆరోపించింది.అభ్యర్ధులకు అక్రమ ఆర్ధిక మద్ధతు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలను తిప్పికొట్టడానికి ప్రయత్నించి వుండొచ్చని పేర్కొంది.అదే విధంగా 2019లో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు కెనడా రాజకీయ దృశ్యంలో.
ఆ దేశ ప్రయోజనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రహస్య కార్యకలాపాలలో నిమగ్నమై వున్నారని సీఎస్ఐఎస్ పేర్కొంది.
అయితే భారత ప్రభుత్వం.ఈ ఆరోపణలు ఖండించింది.ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలలో జోక్యం చేసుకోకూడదనే తన నిబద్ధతకు హామీ ఇచ్చింది.
బ్లూమ్‌బెర్గ్( Bloomberg ) నివేదిక ప్రకారం.జనవరిలో కెనడా తన జాతీయ ఎన్నికల్లో విదేశీ జోక్యం ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తన ఉద్దేశాన్ని ప్రకటించింది.
కెనడా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుందంటూ చేసిన నిరాధారమైన ఆరోపణలను తాము తీవ్రంగా తిరస్కరించామని ఫిబ్రవరిలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీన్ జైస్వాల్ అన్నారు.