తెలంగాణ సర్కార్( Telangana Govt ) నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసిన ఫలితాలలో ఎంతోమంది పేదింటి విద్యార్థులు మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలోని రామన్నపేట( Ramannapeta )కు చెందిన ఉపాధ్యాయుడు పోతరాజు వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులంతా ఉద్యోగులే కావడం గమనార్హం.
పోతరాజు వేంకటేశ్వర్లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యనభ్యసించి 1996 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.ప్రస్తుతం వేంకటేశ్వర్లు పిల్లాయిపల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.పోతరాజు వేంకటేశ్వర్లు భార్య శారద మహాత్మ జ్యోతిరావూపూలే పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు.
ఈ దంపతుల కుమారుడైన సుశాంత్ మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసి ఇంటెల్ కోర్ లో జాబ్ చేస్తున్నారు.కోడలు పావని ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ఆర్ అండ్ బీలో అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ సాధించారు.పావని( Pavani ) ఇటీవల పాలిటెక్నిక్ లెక్చరర్ గా కూడా ఎంపిక కావడం గమనార్హం.ఒకే ఫ్యామిలీలో </emనలుగురు మంచి ఉద్యోగాలు సాధించడం సులువైన విషయం కాదు.
ఈ ఉద్యోగాలలో మెజారిటీ ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కావడం గమనార్హం.ఈ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
పోతరాజు ఫ్యామిలీ సక్సెస్ స్టోరీని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ కుటుంబాన్ని ఎన్నో కుటుంబాలు స్పూర్తిగా తీసుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు.
పోతరాజు ఫ్యామిలీ ఈ ఉద్యోగాలు సాధించడం కోసం ఎంతో కష్టపడిందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.తల్లీదండ్రులు మంచి ఉద్యోగాలలో స్థిరపడితే పిల్లలు సైతం తల్లీదండ్రులను అనుసరించి కెరీర్ పరంగా సులువుగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.