టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి( Sai Pallavi )కి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది.మనసుకు హత్తుకునే పాత్రల్లో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
త్వరలో అమరన్( Amaran ) అనే సినిమాతో సాయిపల్లవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లోకి రాకముందు వైద్య విద్య కోసం జార్జియా( Georgia ) వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.అక్కడ నేను టాంగో డ్యాన్స్ నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు.టాంగో డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక క్యాస్టూమ్ ఉంటుందని సాయిపల్లవి వెల్లడించారు.ఆ క్యాస్టూమ్ ను నేను సౌకర్యంగా ఫీలైన తర్వాత మాత్రమే ఆ డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కొంతకాలానికి నాకు ప్రేమమ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సాయిపల్లవి అన్నారు.ప్రేమమ్ సినిమా రిలీజైన తర్వాత నా టాంగో డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేశారని ఆమె తెలిపారు.ఆ కామెంట్లు నన్ను బాధించడంతో శరీరం కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.రాను రాను అది ఒక నియమంలా మారిపోయిందని ఆమె వెల్లడించారు.
అలా చేయడం వల్ల మూవీ ఆఫర్లు తగ్గాయా అంటే చెప్పలేనని ఆమె కామెంట్లు చేశారు.నా యాక్టింగ్ స్కిల్స్ పై నమ్మకంతో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు.
సాయిపల్లవి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అమరన్ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సాయిపల్లవి ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సాయిపల్లవి మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.సాయిపల్లవి సరికొత్త కథాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.