ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష,2000/- రూపాయల జరిమానా

ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష,2000/- రూపాయల జరిమాన విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సి.ఐ ఒక ప్రకటనలో తెలిపారు.

 In The Case Of The Wall Of The House, The Attacker Will Be Imprisoned For Two Ye-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…..చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ @గట్టు వసంత, భర్త మల్లేశం అనే మహిళ అదే గ్రామానికి చెందిన గల బొజ్జ @ గట్టు మోహన్ కు ఇంటి ప్రక్కన ఉన్న భూమి విషయంలో గొడవలు జరుగగా తేదీ 16.8.2014 రోజున వసంత ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా మోహన్ గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్న వసంత ని బూతులు తిట్టి కొట్టగా వసంత కుడి వేలు విరుగగా వసంత చందుర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరువున పి.పి విక్రాంత్ వాదించగా cms ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్ట్ కానిస్టేబుల్ తిరుపతి ,cms కానిస్టేబుల్ మధుసూదన్ కోర్టు లో సాక్ష్యులను ప్రవేశపెట్టగా కేసు పూర్వపరాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరం రుజువు కావడంతో నిందితుడు బొజ్జ @ గట్టు మోహన్ రెండు సంవత్సరాల జైలు శిక్ష ,రెండు వెయిల రూపాయలు జరిమానా విధించినట్లు చందుర్తి సి.ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube