సాధారణంగా సినిమాలో ఒక్క సీన్ లో నటించినా ఆ సీన్ ను ఒకేరోజులో పూర్తి చేయడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.హీరో సూర్య ( Suriya )త్వరలో కంగువా సినిమా( Kanguva Movie )తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

కొంతకాలం క్రితం నేను, రజనీకాంత్ ( Rajinikanth )సార్ విమానంలో ప్రయాణించామని సూర్య తెలిపారు.ఆ సమయంలో పలు విషయాల గురించి మా మధ్య చర్చ జరిగిందని సూర్య పేర్కొన్నారు.ఆ సమయంలో రజనీకాంత్ మీలో స్టార్ మాత్రమే కాదని మంచి నటుడు ఉన్నాడని అందువల్ల యాక్షన్, కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమై ఉండవద్దని అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నించాలని సూచించారని తెలిపారు.

రజనీకాంత్ మాట వల్లే సింగం ( Singam )లాంటి యాక్షన్ సినిమాలో నటించానని అదే సమయంలో జై భీమ్ లాంటి సినిమాలో సైతం నటించానని సూర్య పేర్కొన్నారు.సింగం, జై భీమ్ సినిమాలలో వైవిధ్యం ఎలా చూపించగలిగావని నా కూతురి నుంచి చాలాసార్లు ప్రశ్న ఎదురైందని సూర్య చెప్పుకొచ్చారు.విక్రమ్ లో రోలెక్స్ పాత్ర ఒక్క పూటలోనే పూర్తైందని ఆయన వెల్లడించారు.ఆ పాత్రకు నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా క్రేజ్ రావడం ఆనందంగా ఉందని సూర్య తెలిపారు.
లోకేశ్ కనగరాజ్ రోలెక్స్ రోల్ ఆధారంగా సినిమా ఎందుకు చేయకూడదని అడిగాడని ఆయన చెప్పుకొచ్చారు. కంగువా లాంటి సినిమా తమిళంలో ఇప్పటివరకు రాలేదని సూర్య వెల్లడించారు.
సూర్య చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.