టీచర్‌కు ఏకంగా 7 వేల రాఖీలు కట్టిన విద్యార్థులు.. ఇదొక ప్రపంచ రికార్డు

రక్షాబంధన్‌ను( Raksha Bandhan ) పురస్కరించుకుని అందరూ ఇవాళ పండుగను ఉల్లాసంగా జరుపుకుంటున్నారు.తన అన్నలు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీలు ( Rakhi ) కడుతున్నారు.

 Popular Online Tutor Khan Sir Claims World Record 7000 Students Tie Him Rakhi De-TeluguStop.com

రాఖీ కట్టినందుకు తమ చెల్లెలు, అక్కలకు సోదరులు గిఫ్ట్ లు ఇస్తున్నారు.ఇలా రాఖీ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.

మన భారత సంప్రదాయంలో రాఖీ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.రాఖీ పండుగను ప్రేమకు చిహ్నంగా భావిస్తున్నారు.

అయితే రాఖీ పండుగ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడిగా ఏకంగా 7 వేల రాఖీలు కట్టి విద్యార్థులు( Students ) రికార్డ్ సృష్టించారు.ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటివరకు ఎవరికీ రాఖీలు కట్టలేదని, ఇది ఒక ప్రపంచ రికార్డుగా అందరూ చెబుతున్నారు.

పాట్నాకు చెందిన ఖాన్ సర్( Khan Sir ) అనే ప్రముఖ ఆన్ లైన్ ట్యూటర్ రక్షాబంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.దీంతో ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది.

Telugu Tie Rakhi, Khan Sir, Khan Sir Rakhi, Patna, Teacher, Latest-Latest News -

ఆయన పాఠాలు బోధించిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాఖీ కట్టడానికి వచ్చారు.దాదాపు 7 వేల మంది ఉపాధ్యాయుడికి రాఖీలు కట్టారు.పాట్నాలోని తన కోచింగ్ సెంటర్ లో ( Coaching Center ) ఆయన ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 10 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.

వారిలో 7 వేల మంది రాఖీలు కట్టడంతో ఇది ఒక ప్రపంచ రికార్డుగా( World Record ) మారిపోయింది.ప్రపంచంలో ఒకరికి ఇంతమంది ఎప్పుడూ రాఖీలు కట్టలేదని చెబుతున్నారు.

Telugu Tie Rakhi, Khan Sir, Khan Sir Rakhi, Patna, Teacher, Latest-Latest News -

అయితే అందరూ రాఖీలు కట్టేందుకు పోటీ పడటంతో కొందరు కట్టలేకపోయారు.దాదాపు రెండన్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.ఉపాధ్యాయుడు మాట్లాడుతూ. తనకు సొంత సోదరి లేదని, ప్రతి సంవత్సరం విద్యార్థులతోనే రాఖీలు కట్టించుకుంటున్నట్లు చెప్పారు.తన క్లాసులు వినడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తారని చెబుతున్నారు.విద్యార్థినులను తన సొంత సోదరీమణులుగా చూసుకుంటానని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube