సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ డైరెక్టర్లుగా ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందు వచ్చిన పొలిమేర( Polimera Movie ) అనే సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్( Director Anil Viswanath ) ప్రస్తుతం పొలిమేర 2 ( Polimera 2 ) అనే సినిమా చేశారు.
ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది అందులో భాగంగానే ఆ సినిమా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఇలాంటి క్రమంలో ఈ సినిమా పొలిమేర పార్ట్ 1 కి మించి హిట్ అవుతుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు వేరే సినిమాకు అసలు సంబంధం ఉండదు ఇది సక్సెస్ అయితే పొలిమేర పార్ట్ 3 సినిమా( Polimera 3 ) కూడా చేస్తాను కానీ దానికంటే ముందు ఒకటి, రెండు వేరే సినిమాలు చేసిన తర్వాత ఈ పొలిమేర 3 చేస్తాను ఎందుకంటే వరుసగా ఇవే సినిమాలు చేయడం వల్ల జనాలు నన్ను చేతబడి డైరెక్టర్ అని పిలుస్తారు ఏమో అని అనుకుంటూ డైరెక్టర్ నవ్వుకున్నాడు…
ఇక ఇటువంటి క్రమంలో ఈయన నెక్స్ట్ శర్వానంతో( Sharwanand ) ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇప్పటికే దానికి సంబంధించిన కథని రెడీ చేసుకుని పెట్టాడంట అది ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా తెలుస్తుంది.ఇక ఈ డైరెక్టర్ చేసే సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది ఎందుకంటే శర్వా ఇప్పుడు ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తి అయితే అప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది…ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…
.