Banana Cultivation : అరటి సాగులో పిలకల తయారీ.. ప్రధాన పొలంలో పిలకలు నాటుకునే విధానం..!

భారతదేశం మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటి పంట ఆక్రమించింది.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అధిక విస్తీర్ణంలో అరటి సాగు( Banana Cultivation ) అవుతోంది.

 Planting Methods In Banana Cultivation-TeluguStop.com

మన తెలుగు రాష్ట్రాలలో తెల్ల చక్కెర కేళి, అమృత పాణి, వామన కేళి, గైండ్ నైన్, రస్తాళి రకాలు సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.అరటి పంట సాగుకు 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం.

ఉష్ణోగ్రత పది డిగ్రీల కంటే తగ్గితే అరటి గెలలో పెరుగుదల ఉండదు.ఉష్ణోగ్రత 40 సెంటీ డిగ్రీలు పెరిగితే అరటి మొక్క ఆకులపై మచ్చలు ఏర్పడి ఎదుగుదల ఆగిపోతుంది.

అరటి సాగులో అత్యంత కీలకం పిలకల ఎంపిక.ఈ అరటి పిలకలను టిష్య కల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు.

కొత్త అరటి తోట వేయాలంటే.మూడు నెలల వయసు ఉండే అరటి పిలకలు అవసరం.

ఈ పిలకలను తెగుళ్లు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి.

Telugu Agricultur, Banana, Tips, Methods Banana-Latest News - Telugu

సూది మొన ఆకులు గల పిలకలను నాటుకోవడానికి ఎంపిక చేయాలి.సూది మొన ఆకులు( Needle-Leafed ) ఉండే పిలకలు త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంట దిగుబడి ఇస్తాయి.ఇక ఆ పిలకల దుంపలపై ఉండే పాతవేర్లను తీసేయాలి.దుంప బరువు 1.5 -2 కేజీలు ఉండేటట్లు చూసుకోవాలి.పిలకల దుంపలకు ఏవైనా గాయాలు అయితే ఆ భాగాన్ని కత్తిరించాలి.పిలక మొక్క పై భాగం కత్తిరించి నాటితే త్వరగా నాటుకొని బాగా పెరుగుతుంది.ఈ పిలకలను నాటేముందు ఒక శాతం బావిస్టన్ ద్రావణంలో ఐదు నిమిషాలు ముంచి ఆ తర్వాత నాటుకోవాలి.

Telugu Agricultur, Banana, Tips, Methods Banana-Latest News - Telugu

పొట్టి రకాలను సాగు చేస్తే 1.5 మీటర్ల గోతులు, పొడవు రకాలు అయితే 2 మీటర్ల గోతులు తవ్వి దుంపలు నాటాలి.ఈ గుంతలలో ఐదు కేజీల పశువుల ఎరువు, 5 గ్రాముల కార్బో ఫ్యూరాన్ గుళికలు వేయాలి.

అరటి పిలకలు నాటిన 15 రోజులలోపు వేర్లు తొడుగుతాయి.ఒకవేళ వేర్లు రాని యెడల 20 రోజుల తర్వాత ఆ పిలకల స్థానంలో కొత్త పిలకలు నాటుకోవాలి.

నీటి వసతిని అనుసరించి జూన్ నుండి నవంబర్ మాసం వరకు అరటి పిలకలు నాటుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube