ఉద్యోగుల కోతలను షురూ చేసిన పెప్సికో... త్వరలో ఇంటికి!

అందరూ ఊహించినట్టుగానే దిగ్గజ బడా కంపెనీలన్నీ ఉద్యోగులను తీసివేసే పనిలో పడ్డాయి.ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌తో మొదలైన ఈ నయా కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.

 Pepsico Which Has Started Layoff Employees Soon! Employee, Layoff, Pepsico, L-TeluguStop.com

అందుకేనేమో మనవాళ్ళు ప్రయివేట్ జాబ్ వద్దురా… గవర్నమెంట్ జాబ్ ముద్దురా అనేది.ఇంకా భయంకర విషయం ఏమంటే ప్రైవేట్ జాబ్ వున్నవారికి పెళ్లిళ్లు కూడా కానీ పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం అమెజాన్‌, ఫేస్‌బుక్‌తో పాటు పలు కంపెనీలు లే ఆఫ్స్‌ను ముమ్మురంగా ప్రకటిస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలో పెప్సికో కంపెనీ చేరడం బాధాకరం.

వాల్‌ స్ట్రీట్‌ జనర్నల్‌ ప్రకారం.పెప్సికో ఇంక్‌ న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలోని స్నాక్‌ అండ్‌ బేవరేజెస్‌ యూనిట్ల నుంచి దాదాపు 100 మందికిపైగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉందట.

అయితే, ఈ ఉద్యోగుల తొలగింపుపై సదరు కంపెనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కొసమెరుపు.ఉద్యోగులకు పంపిన మెమోలో సంస్థను సరళీకృతం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పని చేయవచ్చని కంపెనీ తెలిపినట్లు వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ తెలిపింది.

Telugu Amazon, Apple, Employee, Latest, Layoff, Meta Platm, Pepsico-Latest News

ద్రవ్యోల్బణం నిలకడలేమితోనే పరిశ్రమలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాలతో పాటు స్నాక్స్ యూనిట్లో ఇప్పటికే తొలగింపులు చేపట్టారని సమాచారం.ఫలితంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ ఇంక్‌తో పాటు CNS తదితర మీడియా దిగ్గజాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.ప్రస్తుతం అమెజాన్‌, ఆపిల్‌, మెటా ప్లాట్‌ఫామ్‌ ఇంక్‌ తదితర బడా టెక్‌ కంపెనీలు కూడా వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube