Pushpa 2 Music Album : పుష్ప 2 ఐటెం సాంగ్ కంపోజ్ అప్పుడే అయిపోయిందా.. మళ్ళీ డిఎస్పీ ఆకట్టుకుంటాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

 Latest Update On Pushpa 2's Music Album, Allu Arjun , Pushpa 2 , Director Sukuma-TeluguStop.com

అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.

ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం గురించి చెప్పాల్సిన పని లేదు.

ఈయన తన సంగీతంతో సంచలనం సృష్టించాడు.చాలా రోజుల నుండి ఆకట్టుకునే సాంగ్స్ ఇవ్వక ఈయన గ్రాఫ్ పడిపోయింది.

కానీ పుష్ప సినిమాతో మరోసారి ఈయన టాప్ లోకి వెళ్ళిపోయాడు.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిఎస్పీ ఇప్పటికే మూడు పాటలను కూడా కంపోజ్ చేసి పెట్టారని.

అందులో అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉంది అని తెలుస్తుంది.ఈసారి కూడా ఐటెం సాంగ్ ను అదిరిపోయే లెవల్ లో కంపోజ్ చేసాడని.సుకుమార్ కు, అల్లు అర్జున్ కు బాగా నచ్చడంతో లాక్ చేసారని టాక్.మరి ఈ ఐటెం సాంగ్ ను కూడా మరో హీరోయిన్ చేయబోతుంది అని తెలుస్తుంది.

ఇలా దేవి శ్రీ పార్ట్ 2 లో కూడా తన పాటలతో మాయ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Sukumar, Pushpa, Pushparaj-Movie

పుష్ప 2 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉంది.అల్లు అర్జున్ కూడా సిద్ధంగానే ఉన్నాడు.కానీ ప్రెజెంట్ రష్యా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ త్వరలోనే ఇండియాకు వచ్చి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube