గుండెను బ‌ల‌ప‌రిచే వేరుశనగ వెన్న..ఎలా తీసుకోవాలంటే?

గుండె బ‌లంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము మ‌రియు ఎక్కువ కాలం జీవిస్తాము.ఎప్పుడైతే దాని గురించి నిర్ల‌క్ష్యం చేస్తూ వ్యవ‌హ‌రిస్తామో.

 Peanut Butter Increase Your Heart Health! Peanut Butter, Heart Health, Heart, He-TeluguStop.com

అప్ప‌టి నుంచీ జీవ‌త కాతం త‌గ్గ‌డం ప్రారంభం అవుతుంది.అందుకే గుండె ఆరోగ్యాన్ని బ‌ల‌ప‌రిచే ఆహారాలు తీసుకోవాల‌ని నిపుణులు త‌ర‌చూ సూచిస్తుంటారు.

అయితే గుండెకు మేలు చేసే ఆహారాలు చాలానే ఉన్నాయి.వాటిలో వేరుశ‌న‌గ‌ వెన్న (పీన‌ట్ బ‌ట‌ర్‌) కూడా ఒక‌టి.

వేరుశన‌గ‌ల నుంచి వేరుశ‌న‌గ‌ల వెన్న‌ను త‌యారు చేస్తారు.

ఇది ఎంతో రుచిగా ఉండ‌ట‌మే కాదు.

బోలెడ‌న్ని విట‌మిన్స్‌, మిన‌రట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉంటుంది.అందుకే వేరుశ‌న‌గ వెన్న ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌గ‌ల‌దు.

ముఖ్యంగా గుండెను బ‌ల‌ప‌ర‌చ‌డంలో వేరుశ‌న‌గ వెన్న అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

రెగ్యుల‌ర్‌గా రెండు స్పూన్ల వేరుశ‌న‌గ వెన్నను తీసుకుంటే అందులో ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించేస్తాయి.

Telugu Benefitspeanut, Tips, Healthy Heart, Heart, Latest, Peanut Butter-Telugu

అదే స‌మ‌యంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.దాంతో గుండె పోటు మరియు ఇత‌ర గుండె సంబంధిత వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Telugu Benefitspeanut, Tips, Healthy Heart, Heart, Latest, Peanut Butter-Telugu

అలాగే వేరుశెన‌గ వెన్నను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.అవును, వేరుశెన‌గ వెన్న‌ను తీసుకుంటే మ‌ధుమేహం వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.బ‌ల‌హీన‌మైన ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.శ‌రీరానికి ఫైబ‌ర్ పుష్క‌లంగా అందుతుంది.ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.మ‌రియు చ‌ర్మం కూడా హెల్తీగా మారుతుంది.

ఇక వేరుశెన‌గ వెన్న‌ను ఎలా తీసుకోవాలి అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.దీనిని మీరు డైరెక్ట్‌గా తినొచ్చు.

బ్రెడ్‌తో పాటుగా తీసుకోవ‌చ్చు, మిల్క్ షేక్స్‌లో యాడ్ చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు.ఎలా తీసుకున్నా ఆరోగ్య‌మే.

కానీ, అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికే చేటు జాగ్ర‌త్త‌!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube