వైసీపీ నేతలకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు.టీడీపీకి చెందని ఎవరెవరి ఖాతాలకు నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు.
నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్ చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదని పయ్యావుల ప్రశ్నించారు.పిల్లల భవిష్యత్ కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
ప్రభుత్వం కట్టుకథలతో లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కోర్టుకు వెళ్తామని పయ్యావుల హెచ్చరించారు.