పనితీరే కొలమానం - లేకుంటే తప్పుకుంటా!

ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర ( varahi yatra , )చేస్తున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్( pawan kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన తానెంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడో రాష్ట్ర అభివృద్ధి పట్ల తనకు ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకున్నారు.

 Pawan Kalyan,comments In Varahi Yatra , Varahi Yatra, Pawan Kalyan, Ap Politic-TeluguStop.com

వారాహి యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ( East Godavari District )చేబ్రోలు లో సెరి కల్చర్ రైతులతో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన తనకి ఒక అవకాశం ఇవ్వాలని,ఇస్తే రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తానని వ్యాఖ్యానించారు.రాష్ట్ర అభివృద్ధిపై చిత్త శుద్ది తో ఉన్నానని, తనని నమ్మి 202 4, 2029 ఎన్నికలను చూడాలని అధికారాన్ని బాధ్యతగా చూసే రాజకీయం చేస్తానని, తన పనితీరు నచ్చకపోతే తనను తొలగించే అధికారం కూడా ప్రజలకు ఇస్తానంటూ ఆయన సరికొత్త రాజకీయ విధానానికి తెర తీశారు.

Telugu Ap, Godavari, Jana Sena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

అధికారమే పరమావధిగా బ్రతికే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో నచ్చకపోతే దిగిపోతాను అని చెప్పే రాజకీయ నాయకులు భూతద్దంతో వెతికినా కనిపించరు.పవన్ తన వ్యాఖ్యలతో సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు, ఇది నిజంగా ప్రజల్ని ఆలోచింపజేసే స్టేట్మెంట్ లానే కనిపిస్తుంది.ఎందుకంటే ఎన్నో ఆశలతో రాజకీయ నాయకులనుగెలిపిస్తుంటారు ప్రజలు .ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి నచ్చినా , నచ్చకపోయినా తొలగించే అధికారం ప్రజలకు లేదు.రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలని, ప్రజల అంచనాలకు భిన్నంగా పనిచేసే రాజకీయ నాయకులను తొలగించే అధికారం ప్రజలకే ఉండాలని చాలాకాలంగా రాజకీయ విశ్లేషకులు, మేధావులు గొంతు చించుకుంటున్నా కూడా ఆదేశిగా ఆలోచిస్తున్న రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు గాని లేవు.v

Telugu Ap, Godavari, Jana Sena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

కానీ తన వ్యాఖ్యలతో రాజకీయాల్లో తిరిగి జవాబుదారీతనం తీసుకొస్తాం అన్న జనసేనాని తన వ్యాఖ్యల ద్వారా తన ఎంత కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకుడో అన్న మరోసారి నిరూపించుకున్నారు అని చెప్పవచ్చు .తన వాఖ్యలు ప్రజల్లో ప్రభావం చూపిస్తే మాత్రం ఆయన సరికొత్త లీడర్ గా అవతరించే అవకాశం తొందర్లోనే ఉంది అని చెప్పవచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube