మనం బట్టలను కొనుగోలు చేయడానికి షాపింగ్ మాల్‌కు వెళుతూ ఉంటాం.అక్కడికి వెళ్లిన తర్వాత మన సైజుకి తగ్గట్లు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాం.
అక్కడ ఉండే అనేక రకాల దుస్తుల్లో ఏది బాగుంటుందో అర్ధం కాక కన్‌ప్యూజ్ అవుతూ ఉంటాం.అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్( Google ) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిది.
దీని ద్వారా మీ సైజు చెబితే చాలు.మీరు ఎలాంటి బట్టలను కొనుగోలు చేస్తే మంచిదనేది గూగుల్ వెంటనే చెప్పేస్తుంది.

మన సైజు చెబితే ఏ బట్టలు కొనుక్కోవాలని చెప్పే కొత్త ఈ కామర్స్ టెక్నాలజీని( Commerce Technology ) గూగుల్ డెవలప్ చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) సాయంతో ఈ ఫ్లాట్‌ఫామ్‌ను తయారుచేసింది.ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా బెస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మంచి బట్టలను కొనుగోలు చేయవచ్చు.గూగుల్ తయారుచేసిన వర్చువల్ ట్రై ఇన్ ఫీచర్ ద్వారా షాపింగ్ సౌకర్యవంతంగా చేయవచ్చు.
డబుల్ ఎక్స్‌ఎల్, 4 ఎక్స్‌ఎల్ నుంచి వివిధ ఆకారాల్లో శరీరం కలిగిన వారికి ఎలాంటి దుస్తులు సెట్ అవుతాయనేది విశ్లేషించి మంచి సూచనలు చేస్తుంది.

ముడతలు, సాగిన దుస్తుల లక్షణాలను కూడా ఈ ఫీచర్ పరిశీలించి తెలియజేస్తుంది.బట్టలు మనకు కనిపిస్తాయి, సరిపోతాయి అని వినియోగదారులకు చెప్పడమే ఈ ఫీచర్ లక్షణంగా తెలుస్తుంది.తొలుత మహిళల టాప్స్‌పై ఈ ఫీచర్ ద్వారా దృష్టి పెట్టారు.
రానున్న రోజుల్లో పురుషుల దుస్తుల కోసం కూడా ఫీచర్ తీసుకురానున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే ఈ ఫీచర్ వెనుక ఉన్న టెక్నాలజీని వివరించే రీసెర్చ్ డాక్యుమెంట్‌ను కూడా గూగుల్ విడుదల చేసింది.
రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ ఈ కామర్స్ వెబ్‌సైట్లకు బాగా ఉపయోగపడనుందని తెలుస్తోంది.







