జక్కన్నను ఫాలో అవుతున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్‌ను మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టాలని చూస్తున్నాడు పవన్.

 Vakeel Saab To Start Digital Promotions, Pawan Kalyan, Vakeel Saab, Digital Prom-TeluguStop.com

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్‌గా కనిపిస్తాడు.

అయితే ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయాయి.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గకుండా ఉండేలా చూడాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ చేసిన పనినే వకీల్ సాబ్ చేయాలని చూస్తున్నాడు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంపై అంచనాలను పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక్కసారిగా డిజిటల్ ప్రమోషన్స్‌ చేసింది.

టైటిల్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంటి వరుస ట్రీట్‌లతో జనాల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇప్పుడు ఇదే స్ట్రాటజీని వకీల్ సాబ్ వినియోగించుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ ఉందట.

ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్స్‌తో మనముందుకు వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube