'ఓజీ' ని డామినేట్ చేస్తున్న 'హరి హర వీరమల్లు'..క్రేజ్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న టాప్ 2 చిత్రాలు ‘ఓజీ’ మరియు ‘హరి హర వీరమల్లు’.ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Dominating Og Movie Details, Pawan Kalya-TeluguStop.com

సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ రెండిట్లో ‘ఓజీ’( OG Movie ) చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉంది.అభిమానులు ఏ ఈసినిమా పేరు ఎత్తితేనే పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఇంతకు ముందు ఏ డైరెక్టర్ కూడా చూపించని విధంగా సుజిత్ ఈ చిత్రం లో చూపించాడని, పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది.రీసెంట్ గా స్టార్ హీరోలకు సంబంధించిన అన్నీ టీజర్లు మరియు గ్లిమ్స్ వీడియోలు వచ్చాయి, కానీ క్వాలిటీ పరంగా, టేకింగ్ పరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఓజీ గ్లిమ్స్ వీడియో కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి.

Telugu Show, Harihara, Og, Pawan Kalyan, Pawan Og, Ustaadbhagat-Movie

ఇది సోషల్ మీడియా లో ‘ఓజీ’ కి ఉన్న క్రేజ్.కానీ బయట మాత్రం ఓజీ కంటే ఎక్కువగా ‘హరి హర వీరమల్లు’( Harihara Veeramallu ) సినిమాకే క్రేజ్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఓజీ చిత్రం కేవలం కుర్రాళ్లలో మాత్రమే క్రేజ్ ని సంపాదించింది కానీ, ‘హరి హర వీరమల్లు’ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ ని సంపాదించింది అని అంటున్నారు.ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల అయ్యాయి.

రెండిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కానీ ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 8 నెలల నుండి ఆగిపోయింది.

పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్( Ustaab Bhagat Singh ) సినిమాల మీదనే ఫోకస్ పెడుతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది.కానీ హరిహరవీరమల్లు చిత్రం 80 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

Telugu Show, Harihara, Og, Pawan Kalyan, Pawan Og, Ustaadbhagat-Movie

కానీ ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.అయినా కూడా ఈ సినిమాకి బుక్ మై షో ఆన్లైన్ టికెట్స్ పోర్టల్ లో 90 వేల ఓట్లు రాగా, ఓజీ చిత్రానికి కేవలం 27 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.అలాగే ఇంస్టాగ్రామ్ లో ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి దాదాపుగా 2 లక్షల 50 వేల పోస్టులు పడగా, ఓజీ కి కేవలం 40 వేల పోస్టులు మాత్రమే పడ్డాయి.

ఇలా ప్రతీ చోట ‘హరి హర వీరమల్లు’ చిత్రం ‘ఓజీ’ ని డామినేట్ చేస్తుంది.వచ్చే ఏడాది లో ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఫలితాలు కూడా ఇలాగే ఉండబోతుందా , లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube