పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హడావుడి చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు.రికార్డులు గొడవలు ట్వీట్స్ మాత్రమే కాకుండా జనాలకు మంచి జరిగే పనులు చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తమ వంతు సాయంను అందించేందుకు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును వేదికగా చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వారోత్సవాలను జరుపబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన ఫ్యాన్స్ అందులో భాగంగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న కరోనా ఆసుపత్రులకు నార్మల్ వెంటిలేటర్ సెట్స్‌ను అందించబోతున్నాం అంటూ ప్రకటించారు.
ఫ్యాన్స్ ట్విట్టర్లో ఈ విషయమై ప్రకటిస్తూ… అధ్యక్షుడి జన్మదిన కానుకగా పేదవాడి ప్రాణాలు నిలబెడుదాం.చివరి నిమిషం వరకు ప్రయత్నిద్దాం.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు 2వ తారీకున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న కోవిడ్ ఆసుపత్రిలో నార్మల్ వెంటిలేటర్ సెట్స్‌ను ఒకే సమయంలో పంపిణీ చేద్దాం.ఆక్సీజన్ సిలిండర్ ఆక్సీ మీటర్ ఆక్సీజన్ మాస్క్‌ను సెట్లో భాగంగా ఇవ్వనున్నారు.
మరణించిన తర్వాత సాయం చేయడం కంటే ప్రాణాలను కాపాడటం ఉత్తమం. ఆక్సీజన్ లేక మరణిస్తున్న అభాగ్యులను కాపాడుదాం అంటూ పిలుపునిచ్చారు.
ఈ సాయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు అవ్వండి అంటూ నాగబాబు పిలుపునిచ్చారు.