పవన్ "వారాహి యాత్ర " కొత్త సంకేతాలు ఇస్తుందా?

జనసేన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతుందా? నిన్న కత్తిపూడి లో జరిగిన బహిరంగ సభలో పవన్ స్పీచ్ వింటే ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కీలకమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది.కేంద్ర అధికార పార్టీ అయిన భాజపా ( BJP )రాష్ట్ర అధికారి పార్టీ అయిన వైసిపి కి మద్దతు ఇస్తుందని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .

 Pavan New Strategies Toward Election ?, Pawan Kalyan, Varahi , Jana Sena, Electi-TeluguStop.com

కేంద్ర రాజకీయ అవసరాలకు వైసీపీ సహాయం చేస్తుందని ,అలాగే వైసిపిరాజకీయ అవసరాలకు మద్దతుగా కేంద్రం నిలబడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చి మిత్ర పక్షాన్ని ఇరకాటం లో పెట్టేశారు.వైసీపీకి మేము మొదటి నుంచి దూరంగానే ఉన్నామని, వైసిపి అవినీతిని మొదటి నుంచి ఎండగడుతున్నామన్న రాష్ట్ర బిజెపి నేతల చిత్తశుద్ధిని పవన్ బయట పెట్టేశారు.

మద్దతు లేకపోతే ఇన్ని వేల కోట్ల నిధులు ఎందుకు ఇస్తున్నారు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు .

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Varahi-Telugu Political News

అంతేకాకుండా తన స్పీచ్ మొత్తంలో పొత్తులపై ఆయన ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే పొత్తులు తప్పనిసరి అని ఇంతకుముందు రెండు మూడు సభల్లో మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆ ఊసు ఎత్తలేదు .తనపై ఏ కేసులు లేవని, కేంద్ర పెద్దల అడుగులకు మడుగులు ఒత్తే రకాన్ని కాదని , తనకు ఒక అవకాశం ఇస్తే ఏపీ తలరాత మారుస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.పొత్తులు తప్పనిసరి అన్న మాటల స్థానే సీఎం పదవి వస్తే ఆనందంగా స్వీకరిస్తానంటూ ఆయన చేసిన వాఖ్యలు జనసైనికులకు కలిగిస్తున్నాయి .ముఖ్యమంత్రి స్థానానికి తాను సిద్దం గా ఉన్నానని తమ అదినేత ప్రకటించడం తో రెట్టించిన ఉత్సాహం తో తాము పని చేస్తామన్న మాట జనసైనికుల నుండి వినిపిస్తుంది .

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Varahi-Telugu Political News

ఏదేమైనా తన వారాహి యాత్ర( Varahi Yatra‌‌ )తో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయి అన్న అంచనాలను మాత్రం పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )పెంచేసారని వార్తలు వస్తున్నాయి.ముఖ్యమంత్రి రేస్ లో తాము కూడా ఉన్నామని తమను పక్కన పెట్టడం కుదరదన్న స్పష్టమైన సంకేతాలు ఆయన ఇచ్చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube