టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించడం తెలిసిందే.ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై పోరాడటానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు.
మరోపక్క తన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం విషయంలో…బీజేపీ పై కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు.ఇదే సమయంలో త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితులలో ఈ నెల 15వ తారీకు TRSLP పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది అంట.టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇంకా ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.