తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లో అన్ని భాషల ప్రేక్షకులను తన నటనతో మరియు అందం తో మెప్పించిన ముద్దుగుమ్మ స్నేహ.ఈ అమ్మడు 2012 సంవత్సరం లో తమిళ స్టార్ ప్రసన్న తో ఒక్కటి అయిన విషయం తెలిసిందే.2009 సంవత్సరం లో వీరిద్దరూ కలిసి మొదటి సారి ఒక సినిమా కు వర్క్ చేశారు.ఆ సమయం లోనే ప్రేమలో పడ్డారని.
దాదాపు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రేమ విషయాన్ని 2011 సంవత్సరం లో ప్రసన్న మరియు స్నేహ వెల్లడించారు.2012 సంవత్సరం లో వీరిద్దరి వివాహం అయింది.వివాహం జరిగి పది సంవత్సరాలు అవుతుంది.
వీరికి పిల్లలు కూడా ఉన్నారు.
ఈ సమయంలో ఇద్దరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరగడం తో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యంకు గురయ్యారు.
స్నేహ మరియు ప్రసన్న చాలా క్యూట్ కపుల్.సందర్భానుసారంగా వారి కాంబో ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇలా ఇద్దరు విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత అంటూ చాలా మంది మీడియా లో వెతకడం ప్రారంభించారు.వారిద్దరి యొక్క సోషల్ మీడియా లో కలిసి ఉన్నారా అంటూ చూస్తున్నారు.
గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు స్నేహ మరియు ప్రసన్న పుల్ స్టాప్ పెట్టేశారు.
ఎట్టకేలకు తామిద్దరం బాగానే ఉన్నామంటూ ఈ ఫోటో ను షేర్ చేయడం ద్వారా స్నేహ క్లారిటీ ఇచ్చింది.హ్యాపీ వీకెండ్ అంటూ స్నేహ తన భర్త ప్రసన్న కి ముద్దు పెడుతున్న ఫోటో షేర్ చేయడం తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఈ క్యూట్ కపుల్ విడి పోవడం లేదని.
ఈ ఫోటోతో క్లారిటీ వచ్చేసింది.స్నేహ అభిమానులు కూడా హమ్మయ్య మా స్నేహ విడిపోవడం లేదు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.