కార్తీకదీపం 2 కోసం డాక్టర్ బాబు రెమ్యూనరేషన్  తెలుసా.. బాగానే వసూలు చేస్తున్నాడుగా?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి సీరియల్ లో కార్తీకదీపం ( Karthika Deepam ) సీరియల్ ఒకటి.ఈ సీరియల్ ద్వారా నటుడు పరిటాల నిరుపమ్( Paritala Nirupam ) , నటి ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanth ) ఎంతో పాపులర్ అయ్యారు.

 Paritala Nirupam Charges Huge Remuneration For Karthika Deepam 2 Serial, Karthik-TeluguStop.com

వీరిద్దరూ ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్కగా నటించి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజీ సొంతం చేసుకున్నారు.కార్తీకదీపం సీరియల్ మొదటి భాగం ఏకంగా 1600 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి అయ్యింది.

ఇక ఈ సీరియల్ పూర్తి అవ్వడంతో ఎంతోమంది అభిమానులు తీవ్ర స్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేశారు.

కార్తీకదీపం సీరియల్ కి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి డైరెక్టర్ ఈ సీరియల్ కి సీక్వెల్ గా కార్తీకదీపం 2( Karthika Deepam 2 ) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సీరియల్ ప్రస్తుతం ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది.  ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుని ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సీరియల్ లో కార్తీక్, దీప పాత్రలు ఉండడంతో ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా ఈ సీరియల్ చూస్తున్నారు.

ఇలా ఈ సీరియల్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సీరియల్ కి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఈ సీరియల్ డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్నటువంటి నిరుపమ్ రోజుకు తీసుకునే రెమ్యూనరేషన్ ( Remuneration ) కి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సీరియల్ కోసం ఈయన రోజుకు 40 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా రోజుకు 40 వేలు అంటే మామూలు విషయం కాదని బుల్లితెర నటులుగా అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube