బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha )సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )ఆమెకు తొమ్మిది రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను జైలుకు తరలించారు.అయితే కోర్టు ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.
మీడియా ప్రశ్నలు అడిగినా మీరెలా మాట్లాడతారని కవితను ప్రశ్నించారు.మరోసారి ఇలా మాట్లాడవద్దని జడ్జి హెచ్చరించారు.
కాగా కోర్టు ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఆరోపించారు.బయట బీజేపీ ( BJP )వాళ్లు మాట్లాడుతున్నదే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే కొత్తగా ఏమి లేదన్న కవిత ఇది తప్పుడు కేసని వెల్లడించారు.