ప్రపంచంలో ఏ మహిళ అయినా సరే గర్భధారణ సమయం( Pregnancy )లో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కనబోయే బిడ్డలకోసం మంచి ఆహారం తీసుకుంటూ సరైన సమయానికి మందులు తీసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తుంది.ఇక గర్భిణీలు( Pregnant Woman ) తీసుకునే ఆహారం వల్లనే వారు పుట్టబోయే పిల్లలపై కూడా ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది.
అందుకే గర్భధారణ సమయంలో గర్భిణీలకు మన పెద్దవారు ఎన్నో రకాల పోషకాహార విలువలు కూడిన ఆహార పదార్థాలను అందజేయడానికి మొగ్గు చూపుతారు.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి పుట్టిన పిల్లలు అరుదైన వ్యాధితో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కాకపోతే ఇలాంటివి ఆహారపు అలవాట్ల వల్ల వచ్చినది కాకపోవచ్చు ఒక్కోసారి జన్యుపరమైన విషయాలతో కూడిన వ్యాధులు కూడా రావచ్చు.ఇకపోతే ఫిలిప్పీన్స్ దేశం( Philippines )లో ఆల్మనే ఓ మహిళ బిడ్డకు జన్మను ఇవ్వగా పుట్టిన బిడ్డ చూడడానికి అచ్చం ఎలుగుబంటిలా కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.ఆ చిన్నారికి శరీరం మొత్తం వెంట్రుకలు రావడం ఓ అరుదైన వ్యాధి( Rare Disease ) కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది.ఇకపోతే తాను గర్భవతిగా ఉన్న సమయంలో పిల్లిని తిన్నానని అందుకోసమే పిల్లాడు శాపానికి గురయ్యాడని మహిళ నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ఫిలిప్పీన్స్ దేశంలోని అపయావో ఫ్రావిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇలా జన్మనిచ్చిన బిడ్డకు కేవలం తలపై కనురెప్పలపై మాత్రమే కాకుండా శరీరం మొత్తం వెంట్రుకలతో నిండిపోయింది.వేర్ వోల్ఫ్ అనే సెంట్రల్ కారణంగా ఇది జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు.ఈ పిల్లాడిని ప్రపంచంలోనే అత్యధిక వెంట్రుకలు ఉన్న శిశువుగా పరిగణిస్తున్నారు.వెర్ వోల్ఫ్ సిండ్రోమ్( werewolf Syndrome ) మానవ శరీరంపై ఎక్కువ వెంట్రుకలు పెరిగే అరుగైన వ్యాధిని కలగజేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.అయితే సదరు జన్మనిచ్చిన తల్లి మాత్రం తాను గర్భం దాల్చిన సమయంలో తన స్నేహితులు తన కోరిక మేరకు ఓ నల్ల పిల్లి మాంసాన్ని తీసుకోవచి దట్టమైన మసాలాలు కలిపి ఉండగా దాన్ని తినడంతో పిల్లాడికి ఇలా కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది.







