పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.అయితే కొన్ని పండ్లు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
అలాంటి పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఏపీ, పంజాబ్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పండే ఈ పండులో శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్నీ లభ్యమవుతాయి.
వైద్య నిపుణులు ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే ఎంతో మంచిదని తెలుపుతున్నారు.
ఎవరైనా ఉదయం సమయంలో వివిధ కారణాల వల్ల అల్పాహారం తినడం సాధ్యం కాకపోతే బొప్పాయి పండు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ, బీ, సీ, డీ విటమిన్లు తగిన మోతాదులో ఉండే ఈ పండులో పెప్సిన్ అనే పదార్థం ఉంటుంది.ఈ పెప్సిన్ పదార్థం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.
ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ అని పిలిచే ఈ పండును అనేక రకాల ఆరోగ్య రుగ్మతల కోసం వినియోగిస్తారు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి.
ఇందులో ఉండే పీచు పదార్థం ప్రేగుల్లో ఉండే విషాన్ని గ్రహించగలదు.రోజు బొప్పాయి తీసుకున్న వారిలో కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.బొప్పాయి చర్మం ముడతలు పడకుండా చేయడంతో పాటు మేను రంగు కూడా మెరుగుపడేలా చేస్తుంది.
బరువును, ఆకలిని తగ్గించడంలో బొప్పాయి తోడ్పడుతుంది.కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలను బొప్పాయి తగ్గిస్తుంది.