ప్రపంచంలో రోజు ఏవో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి.అయితే సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ వింతలు విశేషాలు జరిగినా క్షణాల్లో వైరల్ గా మారి అందరికీ తెలిసిపోతుంది.
ఇప్పుడు కూడా ఓ వింత సంఘటన జరిగింది.ఓ 13 అడుగుల భారీ మొసలి కడుపులో 5000 ఏళ్ళ నాటి బాణం బయటపడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.
షేన్ స్మిత్ అనే వేటగాడు తన వృత్తిలో భాగంగా పెద్ద పెద్ద జంతువులను వేటాడుతూ ఉండేవాడు.అయితే ఓ రోజు తాను వేటాడుతున్న సమయంలో భారీ ముసలి అతను వలకి చిక్కింది.
ఇది గమనించిన వేటగాడు మొదట ఆశ్చర్యపోయాడు.తర్వాత మొసలి కడుపులో బాణం ఉండటాన్ని గమనించి తన మిత్రుడైన ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు.13 అడుగుల మొసలిని పరీక్షించిన ఆర్కియాలజిస్ట్ షెన్ ఆ ముసలి బాణాన్ని మింగినట్లు ఊహించాడు.వెంటనే ముసలి కడుపులో ఉన్న ఆ బాణాన్ని పరీక్షించి ఇది సుమారు ఐదు వేల ఏళ్ల నుంచి 6 వేల సంవత్సరాల నాటి బాణంగా గుర్తించాడు.
ఇంకా ఆ ముసలి కడుపులో బాణమే కాకుండా చేపల ఎముకలు, పక్షి ఈకలు, బంతులు, మొదలైనవి కూడా ఉన్నట్లు గుర్తించారు.
స్థానిక అమెరికన్లు ఫిషింగ్ కోసం బాణాలు, ఫ్లూమ్ లను ఉపయోగించేవారు.కాబట్టి అలా అమెరికన్లు విసిరేసిన వస్తువులను ఆ ముసలి మింగి ఉంటుందని, అలాగే ఓ వేటగాడు విసిరిన బాణానికి గాయపడిన ఓ చేపను ఈ ముసలి తినేసి ఉండడం తో దాని కడుపులో బాణాలు, చేపల ఎముకలు ఉన్నాయని అంచనా వేశారు.ముసలి కడుపులో బయటపడ్డ బాణం పైన పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.
షెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఫేస్ బుక్ లో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ముసలి చిత్రాన్ని కూడా షేర్ చేశారు.