కొబ్బరి తోటల్లో ఎరువుల యాజమాన్యం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల 50 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగు ( Coconut Cultivation )అవుతోంది.కొబ్బరి పంటకు ఏడాదిలో రెండుసార్లు ఎరువులు అందించాలి.

 Ownership Of Fertilizers In Coconut Plantations , Fertilizers, Coconut Cultivat-TeluguStop.com

తొలకరిలో ఎరువులు అందించి, రెండవ దఫా కూడా ఎరువులు అందిస్తే ఏడాదికి ఒక చెట్టు నుండి దాదాపుగా 150 నుండి 200 కాయల దిగుబడి పొందవచ్చు.కొబ్బరి తోటలలో అధిక దిగుబడి కి కీలకం ఎరువుల యాజమాన్యం.

ఏ సమయాలలో, ఎంత మోతాదులో పంటకు ఎరువులు అందించాలో అవగాహన ఉంటే అధిక దిగుబడి సాధ్యం.కొబ్బరి తోటల్లో మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి.

ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉండే కొబ్బరి చెట్లకు 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్( Single Super Phosphate ), 500 గ్రాముల యూరియా, ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాల్సి ఉంటుంది.

Telugu Agriculture, Coconut, Fertilizers, Murate Potash, Phosphate, Urea-Latest

కొబ్బరి తోటల్లో మొక్కలకు ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత 25 కిలోల పశువుల ఎరువు, రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్( Murate of Potash ),ఒక కిలో యూరియా, రెండు కిలోల వేప పిండి ఎరువులు వేయాల్సి ఉంటుంది.

కొబ్బరి తోటలకు ఎరువులు ఏసేముందు భూమిలో తగినంత తేమ ఉండాలి.

చెట్టు చుట్టూ పళ్లెంలో ఎరువులు సక్రమంగా వేయాలి.అప్పుడు అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలవుతుంది.

పైన చెప్పిన ఎరువులను ఒకేసారి కాకుండా రెండు సమభాగాలుగా విభజించుకుని రెండు దాఫలుగా పంటకు అందించాలి.మొదట జూన్-జూలై లో ఒకసారి, సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో రెండవ దఫా ఎరువులు అందించాలి.

Telugu Agriculture, Coconut, Fertilizers, Murate Potash, Phosphate, Urea-Latest

ఎరువులు వేయడానికి ముందు మొక్కకు మూడు నుంచి ఐదు అడుగుల దూరంలో గాడి చేసి, ఎరువులు చల్లి మట్టితో కప్పాలి.ఆ తర్వాత వెంటనే నీరు అందించాలి.మొక్కలకు కావలసిన పోషకాలను కేవలం శాస్త్రీయమైన పద్ధతులలోనే అందించాలి.మొక్కలకు ఉప్పు వేయడం, వేర్లను నరికి వేయడం లాంటి పద్ధతుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube