ఏపీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి మరియు గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షించారు.
అనంతరం సంబంధిత అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామన్న సీఎం జగన్ పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు.
అలాగే ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేక ఎస్ఓపీ ఉండాలని వెల్లడించారు.







