కొబ్బరి తోటల్లో ఎరువుల యాజమాన్యం..!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల 50 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగు ( Coconut Cultivation )అవుతోంది.
కొబ్బరి పంటకు ఏడాదిలో రెండుసార్లు ఎరువులు అందించాలి.తొలకరిలో ఎరువులు అందించి, రెండవ దఫా కూడా ఎరువులు అందిస్తే ఏడాదికి ఒక చెట్టు నుండి దాదాపుగా 150 నుండి 200 కాయల దిగుబడి పొందవచ్చు.
కొబ్బరి తోటలలో అధిక దిగుబడి కి కీలకం ఎరువుల యాజమాన్యం.ఏ సమయాలలో, ఎంత మోతాదులో పంటకు ఎరువులు అందించాలో అవగాహన ఉంటే అధిక దిగుబడి సాధ్యం.
కొబ్బరి తోటల్లో మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి.ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉండే కొబ్బరి చెట్లకు 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్( Single Super Phosphate ), 500 గ్రాముల యూరియా, ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాల్సి ఉంటుంది.
"""/" /
కొబ్బరి తోటల్లో మొక్కలకు ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత 25 కిలోల పశువుల ఎరువు, రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 2.
5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్( Murate Of Potash ),ఒక కిలో యూరియా, రెండు కిలోల వేప పిండి ఎరువులు వేయాల్సి ఉంటుంది.
కొబ్బరి తోటలకు ఎరువులు ఏసేముందు భూమిలో తగినంత తేమ ఉండాలి.చెట్టు చుట్టూ పళ్లెంలో ఎరువులు సక్రమంగా వేయాలి.
అప్పుడు అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలవుతుంది.పైన చెప్పిన ఎరువులను ఒకేసారి కాకుండా రెండు సమభాగాలుగా విభజించుకుని రెండు దాఫలుగా పంటకు అందించాలి.
మొదట జూన్-జూలై లో ఒకసారి, సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో రెండవ దఫా ఎరువులు అందించాలి.
"""/" /
ఎరువులు వేయడానికి ముందు మొక్కకు మూడు నుంచి ఐదు అడుగుల దూరంలో గాడి చేసి, ఎరువులు చల్లి మట్టితో కప్పాలి.
ఆ తర్వాత వెంటనే నీరు అందించాలి.మొక్కలకు కావలసిన పోషకాలను కేవలం శాస్త్రీయమైన పద్ధతులలోనే అందించాలి.
మొక్కలకు ఉప్పు వేయడం, వేర్లను నరికి వేయడం లాంటి పద్ధతుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
ముగ్గు చల్లుతూ ఇంత అందమైన రంగోలి వేయగలరా.. ఈ వీడియో చూస్తే నమ్మలేరు!