క్రికెట్ లో కూడా పుష్పరాజ్ మ్యానియా.. 'తగ్గేదేలే' అంటున్న క్రికెటర్స్!

పుష్ప మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.క్రిస్మస్ కానుకగా గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు కాసుల పంట పండించింది.

 Obed Mccoy Enacts Pushpa After Picking His Maiden Ipl Wicket In Kkr Match, Allu-TeluguStop.com

ఈ సినిమాతో బన్నీ రేంజ్ కూడా మారి పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.

ఆ తర్వాత ఓటిటి  లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్న పుష్ప మానియా ఇంకా తగ్గడం లేదు.పుష్ప మ్యానియా విపరీతంగా పెరిగి పోతుంది.ఈ సినిమా హిట్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం మ్యూజిక్.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా లోని ప్రతి పాట కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి.ఈ పాటలకు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు స్టెప్పులు వేసిన విషయం కూడా తెలిసిందే.

అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మ్యానరిజాన్ని కూడా మన దేశమ్లోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతంగా ఆకట్టుకుంది.ఈయన తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని అలరించింది.

ఈ సిగ్నేచర్ మూమెంట్ ఇప్పటికి వదలడం లేదు.ఈ డైలాగ్ ఆయన చేసే మ్యానరిజం ప్రతి ఒక్కరు ట్రై చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఐపిఎల్ లో కూడా పుష్ప మ్యానరిజం కనిపించింది.

మన ఇండియన్ క్రికెట్ దగ్గర కానీ ఇంటెర్నేష్నల్ క్రికెటర్స్ కానీ ఓ రేంజ్ లో ఈ మ్యానరిజాన్ని అనుసరించారు.ఏకంగా అల్లు అర్జున్ మాదిరిగా కనిపించి జడేజా, వార్నర్ లాంటి క్రికెటర్స్ ఆశ్చర్య పరిచారు.ఇక ఇప్పుడు నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఒక వెస్డిండీస్ ప్లేయర్ మెక్ కాయ్ మ్యాచ్ చివర్లో ఒక కీలక వికెట్ తీసాడు.

ఈ సందర్భంలో ఆయన పుష్ప మూమెంట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.ఈ మ్యాచ్ లో ఇది హైలెట్ గా నిలిచింది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube