'దేవర 2' మూవీ విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసిందోచ్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కి( NTR ) ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ వచ్చిన విషయం తెల్సిందే.అందుకే ఎన్టీఆర్ తో కొరటాల శివ రూపొందిస్తున్న దేవర సినిమా ను( Devara ) ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు.

 Ntr Koratala Siva Devara 2 Movie Release Date Details, Devara 2 Movie Release, D-TeluguStop.com

ఏమాత్రం డౌట్ లేకుండా దేవర సినిమా ను భారీ బ్లాక్ బస్టర్ చేసి తీరుతాను అంటూ కొరటాల శివ బలంగా వాదిస్తూ ఉన్నాడు.తాజాగా కొరటాల శివ( Koratala Siva ) మీడియా ముందుకు వచ్చి దేవర సినిమా కథ ను సింగిల్ పార్ట్‌ లో చెప్పడం కష్టం గా ఉంది.

అందుకే రెండు పార్ట్‌ లుగా తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు.దేవర మొదటి పార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటన వచ్చింది.

Telugu Devara, Devara Sequel, Koratala Siva, Janhvi Kapoor, Koratala Shiva, Ntr

కొరటాల శివ మరోసారి సమ్మర్ లో పార్ట్‌ 1 వస్తుందని పేర్కొన్నాడు.ఇక పార్ట్ 2 విషయం లో స్పష్టత లేదు.మొదట పార్ట్ 2 ని 2024 చివర్లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.కానీ ఇప్పుడు 2025 లో సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

సరిగ్గా ఏడాది తర్వాత దేవర పార్ట్‌ 2 ( Devara 2 ) వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.మరో వైపు ఎన్టీఆర్‌ వార్‌ 2 ( War 2 ) సినిమా ని కూడా 2025 లో విడుదల చేయబోతున్నారు.

Telugu Devara, Devara Sequel, Koratala Siva, Janhvi Kapoor, Koratala Shiva, Ntr

ఆ సినిమా తో క్లాష్ కాకుండా సమ్మర్ ఆరంభం లోనే దేవర 2 సినిమా ను విడుదల చేస్తామని కొరటాల శివ సన్నిహితుల వద్ద చెబుతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దేవర సినిమా మొదటి భాగం సూపర్‌ హిట్ అయితే కచ్చితంగా మరింత మెరుగ్గా ఉండే విధంగా దేవర 2 ని దర్శకుడు కొరటాల శివ రూపొందించే అవకాశాలు ఉన్నాయి.కనుక దేవర 2 సినిమా ను 2025 సమ్మర్‌ లో లేదా ఆ తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది.దేవర 1 ఫలితాన్ని బట్టి దేవర 2 సినిమా విడుదల తేదీ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube