మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నందమూరి ఫ్యామిలీ అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) అయ్యి జైల్లో ఉన్నాడు.ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి చెందిన వారు దాదాపుగా వెళ్లి వచ్చారు.
కానీ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటి వరకు కనీసం ట్విట్టర్ ద్వారా స్పందించడం లేదంటే జైలుకు వెళ్లి పరామర్శించడం వంటివి చేయలేదు.దాంతో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి విషయం లో విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మరీ దారుణంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్( JR ntr ) ను నందమూరి ఫ్యామిలీకి చెందిన వాడు కాదు అన్నట్లుగా వారు సంభోదిస్తున్నారు.ఇంతటి విమర్శలు వస్తున్న కారణంగానో లేదా మరే కారణమో కానీ అతి త్వరలోనే ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు వెళ్లి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ను పరామర్శించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి తో ములాకత్ కి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడు అంటున్నారు.
మొత్తానికి చంద్రబాబు నాయుడును ఈ అన్నదమ్ములు కలిసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో ఇన్ని రోజులుగా వస్తున్న వివాదాలకు విమర్శలకు బ్రేక్ పడ్డట్లు అవ్వబోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా( Devara movie ) లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ చంద్రబాబు నాయుడు ను పరామర్శించేందుకు గాను ఎన్టీఆర్ రాజమండ్రి వెళ్లబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.
అయినా కూడా మామయ్య ను చూసి వచ్చేందుకు రాజమండ్రికి తమ్ముడు ఎన్టీఆర్ తో వెళ్లబోతున్నాడు అంటూ నందమూరి వర్గాల వారు చెబుతున్నారు.