చంద్రబాబు అరెస్ట్ : ఏపీ బీజేపీ అలా.. తెలంగాణ బిజెపి ఇలా 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ అరెస్టు వ్యవహారంపై పెద్ద దుమరమే రేగుతోంది.

 Chandrababu Arrest: Ap Bjp Like This Telangana Bjp Like This , Telangana Bjp, B-TeluguStop.com

చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరిగా లేదంటూ ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా జాతీయస్థాయిలో అన్ని పార్టీలు దాదాపుగా స్పందించాయి . చంద్రబాబును అరెస్టు( Chandrababu arrest ) చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించాయి.ఇక జాతీయ మీడియా సైతం ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు అనుకూలంగా కథనాలు ప్రచారం చేస్తున్నాయి.

ఇక ఏపీలో సంగతి అయితే చెప్పనవసరం లేదు చంద్రబాబు అరెస్టు సెంటిమెంట్ గా మార్చి దానిని వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Bandi Sanjay, Chandrababu, Kishan Reddy, Purandareswari, Telangana Bjp, T

 అయితే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం బిజెపి జాతీయ పెద్దలకు తెలియకుండా జరగదని,  వారి ఆశీస్సులతోనే జగన్ ఈ అరెస్టు వ్యవహారానికి పాల్పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో,  చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ, తెలంగాణ బిజెపి నాయకులు స్పందించారు.చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.ఒక్క అరెస్టుతో ప్రజలలోను చంద్రబాబుకు మైలేజీ పెరిగిందని బండి అన్నారు.

అలాగే మరో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా దీనిపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ మాట్లాడారు.

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ అంశంపై రెండుసార్లు స్పందించారు.ఒకసారి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పినట్లుగా పురందేశ్వరి చెప్పినట్లు కిషన్ రెడ్డి స్పందించారు.

Telugu Bandi Sanjay, Chandrababu, Kishan Reddy, Purandareswari, Telangana Bjp, T

 మరోసారి ఇదే అంశం స్పందిస్తూ చంద్రబాబును అరెస్టు( Chandrababu arrest ) చేసిన విధానం సరికాదని,  ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలంటూ వ్యాఖ్యానించారు.ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు అరెస్టుపై మొదటి రోజు హడావుడి చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.  టిడిపి నిర్వహించిన బంద్ కు బిజెపి మద్దతు లేదని ప్రకటించారు.ఇక టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన సీఎం రమేష్, సృజనా చౌదరి,  ఆదినారాయణ రెడ్డి వంటి వారు ఈ అంశంపై మాట్లాడిన ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారు సైలెంట్ గానే ఉన్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఏపీ బిజెపి నేతలు సైలెంట్ గా ఉండడం , తెలంగాణ బిజెపి నాయకులు హడావుడి చేస్తుండడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతాయి.

ప్రస్తుతం బీఆర్ఎస్ ,చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సైలెంట్ గానే ఉంది.అసలు అక్కడి రాజకీయంతో తమకు పని ఏంటి అంటూ మంత్రి హరీష్ రావు,( Harish Rao )  కేటీఆర్( KTR ) వంటి వారు వ్యాఖ్యానించారు.

అయితే తెలంగాణలోని టిడిపి ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ బిజెపి భావిస్తోంది.అందుకే తెలంగాణ బిజెపి లోని కీలక నాయకులంతా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందిస్తూ తెలంగాణలోని టిడిపి మద్దతుదారుల ఓట్లపై గురి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube